దక్షిణాది సినిమా రంగంలో ఒకప్పుడు భాగ్యరాజా దాసరి నారాయణరావు ఆర్. నారాయణమూర్తి లు తప్ప వారే హీరోలుగా మారి దర్శకత్వం వహించి సూపర్ హిట్స్ కొట్టిన రికార్డు ఎవరికీ లేదు. ఎస్వీ.కృష్ణారెడ్డి అలాంటి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఆమధ్య దర్శకుడు వివి వినాయక్ ‘శీనయ్య’ పేరుతో ఒక సినిమాను మొదలుపెట్టి ధైర్యంగా పూర్తి చేయలేకపోయాడు.


దీనితో దర్శకులు హీరోలుగా మారడం కష్టమా అన్న సందేహాలు చాలమందికి వచ్చాయి. అయితే ఇప్పుడు దక్షిణాది సినిమా రంగానికి చెంది ఏమాత్రం పేరులేని ఇద్దరు దర్శకులు తామే హీరోలుగా మారి తీసిన సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉండటంతో ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా వారిద్దరి వైపే చాల ఆసక్తిగా చూస్తోంది.


కర్ణాటక రాష్ట్రానికి చెందిన రిషబ్ శెట్టి కేవలం 16 కోట్లతో తీసిన ‘కాంతార’ మూవీ దేశవ్యాప్తంగా 300 కోట్లు కలెక్ట్ చేయడంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి అతడు హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఆసినిమాకు బాలీవుడ్ లో కూడ రికార్డు కలక్షన్స్ రావడం చూసి బాలీవుడ్ మీడియా ఆశ్చర్యపడుతోంది. ఇక లేటెస్ట్ గా విడుదలైన ‘లవ్ టు డే’ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి విపరీతంగా చెప్పుకుంటున్నారు. ఈసినిమా కేవలం 5కోట్ల పెట్టుబడితో తీస్తే అప్పుడే ఈమూవీ 100 కోట్ల మార్క్ ను దాటేసింది అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.


టాప్ హీరోలతో స్టార్ దర్శకులు ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే రిషబ్ ప్రదీప్ లు మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా చిన్నసినిమాలు తీసి బ్లాక్ బష్టర్ హిట్ కొట్టడంతో మన టాప్ డైరెక్టర్స్ వారి వద్ద పాఠాలు నేర్చుకుంటే మంచిది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వీరిద్దరూ ఇప్పుడు అనేకమంది రచయితలకు దర్శకులకు రోల్ మోడల్స్ గా మారారు అంటూ ప్రశంసిస్తున్నారు..  మరింత సమాచారం తెలుసుకోండి: