కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ మరియు ఎస్. జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'జిగర్తాండ డబుల్ ఎక్స్'..2014లో వచ్చిన 'జిగర్తాండ' అనే సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. సిద్ధార్థ్ మరియు బాబీసింహ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం అలాగే ఆ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య లాంటి యాక్టర్స్ నటిస్తున్నారనే సంగతి తెలియడంతో ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు రిలీజ్ అయిన సాంగ్స్ మరియు ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలా భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా నవంబర్ 10న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా అయితే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో లారెన్స్, SJ సూర్య తమ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా చూసి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.ముఖ్యంగా సినిమా రిలీజ్ అయిన సమయంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ పోస్ట్ చేస్తూ.." జిగర్ తాండ డబుల్ ఎక్స్ సినిమా చూశాను. కార్తీక్ సుబ్బరాజు నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రం ఇది.. అద్భుతంగా నటించడం ఎస్. జె సూర్యకు అలవాటయిపోయింది. ఒక నటుడుగా రాఘవ లారెన్స్ ఎంతగానో మెప్పించారు... సంతోష్ నారాయణ మ్యూజిక్ ఆకట్టుకుంది..సినిమా చివరి 40 నిమిషాలు నా మనసు దోచుకుంటుంది. సినిమా టింకు ఆల్ ద బెస్ట్" అంటూ పోస్ట్ చేశారు. సినీ ప్రముఖులతో పాటు క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.. అలా అందరి నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద  మాత్రం యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం అనగా డిసెంబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో  స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఆఫీషియల్ గా స్పెషల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: