మరి ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది శ్రీలీల . సినిమాకి హైలెట్గా మారిపోతుంది అంటూ సినిమా రిలీజ్ కి ముందు బాగా ప్రచారం జరిగింది . కానీ సినిమా రిలీజ్ తర్వాత శ్రీలీల ఆ పాజిటివ్ టాక్ అందుకోలేకపోయింది . సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ - రష్మిక పేర్లే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి . అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని ప్రాణం పెట్టి డైరెక్ట్ చేసాడు అంటూ జనాలు పాజిటివ్ గా స్పందిస్తున్నారు . అయితే సుకుమార్ డైరెక్షన్ అంటే కచ్చితంగా జనాలకు ఓ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. తన సినిమాలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక కరెక్ట్ కథను రాసుకుంటాడు అని.. ఆ కథకు తగ్గ న్యాయం చేస్తాడు అని గత సినిమాలు చూసి చెప్పొచ్చు .
కానీ ఎందుకో పుష్ప 1 సినిమాలో సునీల్ కి అదేవిధంగా అనసూయ క్యారెక్టర్ ను పెద్ద హైలెట్ చేయలేకపోయాడు . కనీసం పుష్ప2 సినిమాలో అయినా సరే వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ హైలెట్ చేస్తారు అంటూ జనాలు భావించారు. కానీ అనసూయ క్యారెక్టర్ కి కాస్త ప్రాధాన్యత ఇచ్చారు కానీ మంగళం శీను క్యారెక్టర్ లో ఉన్న సునీల్ కు పెద్దగా స్కోప్ ఇవ్వలేకపోయాడు . సునీల్ పాత్ర పుష్ప2లో డమ్మీగా మారిపోయింది . కొంచెం సుకుమార్ ఆలోచించి పుష్ప2 సినిమాలో సునీల్ క్యారెక్టర్ కొంచెం హైలైట్ అయ్యే విధంగా రాసి ఉంటే సినిమా మరొక లెవెల్ లో ఉండేది అని ..ఇప్పుడు సినిమాకి మైనస్ అంటూ పెట్టడానికి అసలు ఏది ఛాన్స్ లేదు అని ఎవరైనా చూపించాలి అంటే మాత్రం ఒకే ఒక్క సునీల్ క్యారెక్టర్ లో మాత్రమే నెగిటివ్గా చూపించవచ్చు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . సునీల్ క్యారెక్టర్ తప్పిస్తే సినిమాలో ఎక్కడా కూడా మైనస్ పాయింట్స్ ఏ లేవు అంటూన్నారు. అంతేకాదు ఈ సినిమాలో బన్ని నటన చూసిన తర్వాత ఏ స్టార్ హీరో అయినా సరే ఫిదా అవ్వాల్సిందే అని .. బన్నీని టచ్ చేసే స్థాయికి ఏ హీరో రాలేడు అని ..బన్నీ ఫాన్స్ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి