ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అటు నితిన్, ఇటు శ్రీలీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కి అందాల భామ కేతిక శర్మ స్టెప్పులేసిన విషయం అందరికీ తెలిసిందే. అది దా సర్ ప్రైజ్ అనే సాంగ్ కి చిందులేసింది. ఇక ఈ సాంగ్ లిరికల్ వీడియో ఇటీవలే రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
ఈ పాటకి కేతిక శర్మ వేసిన స్టెప్పులను చూసిన ప్రేక్షకులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ పాటకి స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్, డాకూ మహారాజ్ సినిమాలలో వేసిన స్టెప్పులకి కూడా శేఖర్ మాస్టర్ పై వరుసగా చాలానే ట్రోల్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఇదే వరుసలో రాబిన్‌హుడ్ సినిమాలోని అది దా సర్ ప్రైజ్ అనే సాంగ్ కూడా చేరింది. దీంతో ఈ పాట చూసిన నెటిజన్స్ అందరూ ఇవేమైనా రికార్డింగ్ డాన్సులా అంటూ గట్టిగానే ట్రోలింగ్ చేస్తున్నారు.