సినిమా ఇండస్ట్రీ లో ఒకరు వదిలేసిన స్టోరీలో మరొకరు హీరో గా నటించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుం ది . ఇకపోతే ఇలా విజయ్ దేవరకొండ కూడా ఇతర హీరోలు రిజెక్ట్ చేసిన మూవీలలో నటించిన సందర్భాలు ఉన్నా యి . కొంత కాలం క్రితం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన టువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , గౌతమ్ తిన్ననూరి కాంబోలో మూవీ రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ చరణ్ , గౌతమ్ కాంబో మూవీ క్యాన్సల్ అయింది. ఆ తర్వాత గౌతమ్ , విజయ్ కాంబోలో మూవీ ఓకే అయ్యింది.

దానితో అనేక మంది చరణ్ , గౌతమ్ తో తీయాలి అనుకున్న కథతోనే ప్రస్తుతం విజయ్ తో మూవీ ని రూపొందిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ , గౌతమ్ కాంబోలో కింగ్డమ్ అనే మూవీ రూపొందుతుంది. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. కింగ్డమ్ సినిమా తర్వాత గౌతమ్ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఓ కథను తయారు చేసి తారక్ కి వినిపించాడట.

కథ మొత్తం విన్న తారక్ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో హీరో గా నటించడానికి ఒప్పుకోలేదట. దానితో అదే కథను విజయ్ కి గౌతమ్ వినిపించగా ఆ స్టోరీలో హీరోగా నటించడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ రెండు వార్తల కారణంగా విజయ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీలలో వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నాడు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: