సుకుమార్ .. ఈ పేరు గురించి స్పెషల్ గా మాట్లాడాల్సిన అవసరమే లేదు . పాన్ ఇండియా స్థాయిలో బాగా పాపులారిటీ సంపాదించుకునేసింది. మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాతో ఆయన పేరు మరింత స్థాయిలో మారుమ్రోగిపోయేలా చేసింది.  కేవలం ఆయన సినిమాల పరంగానే కాదు ఫ్యామిలీ పరంగా కూడా సోషల్ మీడియాలో హైలెట్ గా మారుతూ ఉంటారు . మరి ముఖ్యంగా ఆయన భార్య తబిత పెట్టే పోస్టులు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అంటూ చాలామంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు . సినీ సెలబ్రెటీస్ కూడా తబితాని ఫాలో అవుతూ ఉంటారు .

కాగా సుకుమార్ తబితల పెళ్లయి 15 ఏళ్లు కంప్లీట్ అయ్యింది. సుకుమార్ తబితను జూన్ మూడవ తేదీ 2009లో పెళ్లి చేసుకున్నారు.  వీళ్ళు తమ వెడ్డింగ్ అనివర్సరీని ఫారిన్ కంట్రీ లో రొమాంటిక్ ప్లేస్ లో సెలబ్రేట్ చేసుకున్నారు . దానికి సంబంధించిన ఫోటోలను కూడా తబితా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది.  చాలా చాలా చక్కగా ఉన్నారు జంట అంటూ జనాలు పొగిడేస్తున్నారు. మరి ముఖ్యంగా సుకుమార్ కి తన భార్య అంటే ఇంత ఇష్టమా..?? అంటూ ఆయన చూపించే ప్రేమ పట్ల ఫీదా అయిపోతున్నారు.

ఇలాంటి మూమెంట్లోని వీళ్ల లవ్ స్టోరీ ఏంటి..? అసలు ఎలా స్టార్ట్ అయింది..? ఎవరు ప్రపోజ్ చేశారు..? అంటూ ఇంట్రెస్టింగ్ గా లవ్ స్టోరీ గురించి తెలుసుకోవడానికి జనాలు ట్రై చేస్తున్నారు.  ఇలాంటి మూమెంట్లోనే  సుకుమార్ ఫ్యాన్స్ ఆయన లవ్ స్టోరీ ని ట్రెండ్ చేస్తున్నారు . సుకుమార్ కి తబిత అంటే చాలా చాలా ఇష్టం . తబిత అడిగిన ఏది కూడా కాదు నో అని చెప్పడు . మరీ ముఖ్యంగా సుకుమార్ -తబిత లవ్ స్టోరీ అచ్చం ఆర్య సినిమా మాదిరే ఉండడం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ . సుకుమార్ తెరకెక్కించిన ఆర్య సినిమా ప్రమోషన్స్ కి స్క్రీనింగ్ కి అటెండ్ అవుతున్న మూమెంట్లో సినిమాలు అంటే పెద్దగా నచ్చని తబిత తన ఫ్రెండ్స్ బలవంతం మీద అక్కడికి వచ్చింది. అయితే అందరూ ఫ్యాన్స్ ఫోటోగ్రాఫ్స్ ఆటోగ్రాఫ్స్ అంటూ ఎగబడుతుంటే తబిత మాత్రం సైలెంట్ గా ఒక దగ్గర కూర్చుని ఉంది .

ఇది గమనించిన సుకుమార్ ఆమెపై స్పెషల్ ఫోకస్ చేశారు . ఎందుకు ఆ అమ్మాయి అలా కూర్చొని ఉంది అంటూ క్యూరియాసిటీ పెంచుకున్నాడు . వెంటనే కలవాలనుకున్నాడు . ఆర్య సినిమాలో మాదిరి ఒక లవ్ లెటర్ ని రాసి అందులో తన ఫోన్ నెంబర్ కూడా జత చేసి ఇచ్చాడు మన రొమాంటిక్ డైరెక్టర్ సుకుమార్ . దీంతో ఇంప్రెస్ అయిపోయిన తబిత ఆ ప్రేమ లేఖ చూసి మురిసిపోయి ఫోన్ చేసింది . ఇక అలా స్టార్ట్ అయిన లవ్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఇద్దరు ప్రేమ పక్షులై విహరించారు.  వీళ్ళ ప్రేమ  బలపడింది . షికారు తిరగడాలు కూడా చేశారు.  ఫైనల్లీ ఈ జంట పెళ్లి చేసుకున్నారు . అయితే మొదట్లో ఈ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోయినా ఆ తర్వాత మాత్రం అంత సెట్ అయింది . ఇప్పుడు ఈ జంట చాలా హ్యాపీగా ఉన్నారు. సుకుమార్-తబితలకు ఒక పాప ఒక బాబు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: