
అయితే ఇప్పుడే గత కొన్ని రోజులుగా సితారే జమీన్ పర్ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ , కుబేర ప్రమోషన్స్ లో నాగార్జున వరుస పెట్టి కూలి సినిమాల్లో తమ క్యారెక్టర్స్ గురించి కొన్ని విషయాలు బయటకు చెప్పేస్తున్నారు .. ఇక అమీర్ ఖాన్ ఏకంగా ఉపేంద్ర, శృతిహాసన్ కాంబినేషన్ సీన్స్ ఉన్నట్లు సంచలన విషయాన్ని రివిల్ చేయగా .. నాగార్జున నిన్న బాలీవుడ్ మీడియా మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మెయిన్ విలన్ గా కనిపించబోతున్నట్లు కన్ఫామ్ చేసేసాడు .. ఇక దీంతో ఈ సీనియర్ హీరోలను ఏమీ అనలేక ఈ లీక్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక లోకేష్ తల పట్టుకుంటున్నాడు ..
అయితే ఆగస్టు 14 న రిలీజ్ కాబోతున్న కూలి సినిమా తెలుగు రైట్స్ విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు .. వార్ 2కు పోటీకి వస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రజినీకాంత్ , ఉపేంద్ర, నాగార్జున , షౌబిన్ , శృతిహాసన్ వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా .. ఇక ఈ నెలలో ఈ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేసే అవకాశం ఉంది .. జూలైలో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది .. ఇక మరి అప్పటివరకు లోకేష్ ఈ సినిమా నుంచి మరిన్ని లీకులు రాకుండా ఆపగలుగుతాడో లేదో చూడాలి .. లేదంటే థియేటర్లో ప్రేక్షకులు థ్రిల్ మిస్ అవుటం ఖాయం .