గ్లామర్ తో పాటు టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతమవుతున్న హీరోయిన్ల జాబితాలో అనన్య నాగళ్ల ఒకరు. కారణం తెలుగమ్మాయి కావడం. 2019లో `మల్లేశం` మూవీతో వెండితెరపై అడుగుపెట్టి తొలి ప్రయత్నం లోనే ప్రేక్షకులను మెప్పించిన అనన్య.. ఆ తర్వాత కథల ఎంపికలో తన ప్రత్యేకత చాటుకుంది. వెండితెరపై గ్లామర్ షో కన్నా ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వ‌చ్చింది. కానీ తెలుగు అమ్మాయి కావడం వల్ల టాప్ హీరోలు, టైర్ 2 హీరోలు కూడా ఆమె వైపు చూడడం లేదు.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై అనన్య మాట్లాడింది. తెలుగులో 100 సినిమాల్లో 20 శాతం మాత్రమే తెలుగమ్మాయిలకు ఉంటాయి. పోనీ తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీల్లో ట్రై చేద్దామంటే అక్కడ 80 శాతం అవకాశాలు స్థానిక అమ్మాయిల‌కే ఇస్తారు. దాంతో తెలుగమ్మాయిలు రాణించడం ఎంతో కష్టంగా మారిపోయిందని అనన్య చెప్పుకొచ్చింది. ఇదే ఇంటర్వ్యూలో అనన్య తన బ్రేకప్ స్టోరీ కూడా రివీల్ చేసింది.


`సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నాను. కానీ పర్సనల్ లైఫ్ లో ప్రేమ విఫలమైనప్పుడు మాత్రం తట్టుకోలేకపోయాను. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికే నాకు బ్రేకప్ జరిగింది. ఈ బాధ త‌ట్టుకోలేక రోజూ నైట్ ఒంట‌రిగా కూర్చుని ఏడ్చేదాన్ని. మార్నింగ్ మ‌ళ్లీ జిమ్‌కు వెళ్లిపోయేదాన్ని. షూటింగ్ లో ఉంటే కారవాన్‌లోకి వెళ్లి ఏడ్చి, మళ్లీ ఏమీ జరగనట్లుగా కెమెరా ముందుకు వ‌చ్చి యాక్ట్ చేసేదాన్ని. ఈ విషయం నా ఫ్రెండ్స్ కు తప్ప ఇంట్లో వాళ్లకు కూడా తెలియదు. బ్రేక‌ప్ బాధ రెండేళ్లు వెంటాడింది. అయితే ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఆ ప్ర‌భావం ప్రొఫెష‌న్ పై ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాను` అంటూ అన్య‌న్య చెప్పుకొచ్చింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: