రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దీ.. ఒకప్పుడు ఆమె ఎవరో కూడా సౌత్ ఇండస్ట్రీ జనాలకు తెలియకపోయేది. అయితే బాలీవుడ్లో ఆమె సుపరిచితురాలే అయినప్పటికీ అంతగా ఫేమస్ అయిన వ్యక్తిలా మాత్రం కనిపించలేదు. కానీ ఎప్పుడైతే సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేసిందని వార్తలు వినిపించాయో ఆ తర్వాత కొద్ది రోజుల నుండి తన సోషల్ మీడియా ఖాతాలో షాకింగ్ పోస్టులు పెట్టడంతో ఆమె నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే రీసెంట్ గా శ్యామలీ ది ఒకసారి నమ్మకం  కోల్పోతే మళ్లీ దాన్ని తిరిగి పొందలేం అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టింది.అయితే ఈ పోస్ట్ పై తాజాగా కౌంటర్ ఇచ్చేలా సమంత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.మరి ఇంతకీ సమంత ఏం పెట్టింది..దాన్ని వదిలేయండి అని శ్యామలీ  దీ ని అందా.. లేక ఆమె పెట్టిన పోస్ట్ నా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

సమంత రాజ్ నిడిమోరు తో ప్రేమలో ఉన్నప్పటినుండి రాజ్ నిడిమోరు భార్య సోషల్ మీడియాలో ఎన్నో సంచలన పోస్టులు పెడుతూ సమంత ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. అయితే శ్యామలీ  ది పెట్టే పోస్టులు అన్నింటికి సమంత కౌంటర్ ఇస్తుంది. అయితే రీసెంట్ గా శ్యామలీ ది పెట్టిన పోస్ట్ కి సమంత కౌంటర్ గా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ఏముందంటే.. ఇతరుల మాటలు ఎప్పుడూ కూడా పట్టించుకోకండి.మనం ఏదైనా సాధించాలి అంటే సైలెంట్ గా కూర్చుంటే జరగదు.దానికోసం నిరంతరం శ్రమించాలి. ఏం జరుగుతుందో జరగనివ్వాలి. ప్రశాంతంగా కూర్చొని ఆస్వాదించాలి కానీ దానితో పోరాడకూడదు. నేను చేయాల్సింది అని కాకుండా నేను తప్పకుండా ఆ పని చేయాల్సిందే అనే విధంగా మీ మైండ్ ని మార్చుకోండి.

మీ శక్తిని లాగేసుకోవడానికి ఎవరు కూడా అర్హులు కాదు.మీ గౌరవాన్ని ఒత్తిళ్లకు అవరోధంగా పెట్టుకోకండి.. నిశ్చలమైన మనసుతో ఆలోచించి ప్రశాంతంగా ఉండండి అంటూ సమంత పోస్ట్ పెట్టింది.అయితే ఈ పోస్టు రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దీని ఉద్దేశించే పెట్టింది అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా శ్యామిలీ ది పెట్టిన పోస్ట్ ని పట్టించుకోకండి అని పెట్టింది. అందుకే ఇతరుల మాటలు పట్టించుకోకండి. ఏం జరుగుతుందో అది జరుగుతుంది అన్నట్లుగా పోస్ట్ పెట్టడంతో చాలామంది నెటిజెన్లు ఇది శ్యామలీ దికి వ్యతిరేకంగానే సమంత పెట్టింది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సమంత శ్యామలీ దీ మధ్య జరిగే ఈ సోషల్ మీడియా వైరం ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: