చిరంజీవి ఇండస్ట్రీ లో ఎంత పెద్ద స్టారో చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి చిరంజీవి మీద నిందలు వేసి తెలిసి తెలియనట్లుగా మాట్లాడితే ఆయన కుటుంబ సభ్యులు ఊరుకుంటారా.. కుటుంబ సభ్యులు ఏమోగానీ అభిమానులే ఊరుకోరు.ఆయన మీద ఎలాంటి తప్పుడు కామెంట్లు చేసినా కూడా పరిగెత్తించి మరీ కొడతారు. అయితే అంతటి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు.అలా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్లడ్ బ్యాంక్ పై అప్పట్లో రాజశేఖర్ జీవిత దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవి అభిమానుల నుండి బ్లడ్ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు అంటూ ఆరోపించారు. 

అయితే ఈ ఆరోపణల పై మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఫైర్ అయ్యారు. అలా రాజ శేఖర్ కెరీర్ కూడా పాతాళానికి పడిపోయింది.అలా రాజశేఖర్ చిరంజీవి మధ్య గొడవ కొనసాగుతున్న సమయంలో ఎన్నో రూమర్లు వినిపించాయి. ముఖ్యంగా రాజశేఖర్ చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాఫ్ అవ్వడం నిర్మాతగా చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అప్పులు పెరిగిపోయి చివరికి ఉండే ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.అలా 200 కోట్ల విలువ చేసే ఇంటిని రాజశేఖర్ అమ్ముకోవాల్సి వచ్చిందట.

అది కూడా ఉపాసనకి.. చిరంజీవి కోడలు ఉపాసన గతంలో రాజశేఖర్ ఇల్లుని కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఇల్లు కొన్న టైంలో చిరంజీవి కావాలనే తన కోడలితో ఈ ఇల్లు కొనిపించారు అంటూ రాజశేఖర్ జీవిత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఆరోపణలు చేసినట్టు రూమర్లు వినిపించాయి. అలా 100 కోట్ల అప్పులకు 200 కోట్ల ఇల్లుని రాజశేఖర్ ఉపాసనకి అమ్ముకున్నారట.అలా చిరంజీవి రాజశేఖర్ మీద ఉన్న పగతోనే తన కోడలితో ఆ హీరో ఇల్లు కొనిచ్చారనే రూమర్లు అప్పట్లో వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: