ఆగష్టు 15 వచ్చింది అంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందడి మొదలౌతుంది.  ఈ వేడుకలతో పాటు కొత్త కొత్త సినిమాలకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేస్తుంటారు.  ఈ ఏడాది మెగా ఫ్యామిలీ నుంచి మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి.  అందులో మొదటగా వచ్చింది మెగాస్టార్ సైరా సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో.  ఈ వీడియో గూస్ బమ్స్ అనిపించే విధంగా ఉన్నది.  



సినిమాపై అంచనాలు పెంచింది.  సినిమా మేకింగ్ కోసం యూనిట్ ఎంతగా కష్టపడిందో వీడియోలో చూపించారు.  అంతేకాదు, ఇందులో నటించిన నటీనటులకు సంబంధించిన విషయాలను కూడా పొందుపరిచారు. దీని తరువాత ఆగష్టు 15 వ తేదీన రామ్ చరణ్ అల వైకుంఠపురంలో సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.  



సినిమా టైటిల్ తో పాటు అల్లు అర్జున్ పాత్రను పరిచయం చేస్తున్న చిన్న వీడియో.  మురళీ శర్మ.. అల్లు అర్జున్ ఇద్దరు ఈ వీడియోలో కనిపిస్తారు.  క్లాసికల్ గా ఉన్న ఆ వీడియో ఆకట్టుకుంది.  నాపేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో ఆటోమాటిక్ గా క్రేజ్ పెరిగింది.  పైగా త్రివిక్రమ్ దర్శకుడు.  సినిమా తప్పకుండా హిట్ కావొచ్చని టాక్ వస్తోంది.  



ఈ రెండు వీడియోలు ఒకెత్తయితే.. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న వాల్మీకి సినిమా టీజర్ మరొక ఎత్తు.  ఇందులో వరుణ్ ను చూపించిన విధానం ప్రతి ఒక్కరిని మెప్పించింది.  మెప్పించడం కాదు వావ్ అనిపించింది.  వరుణ్ తేజ్ ఇలాంటి యాక్టింగ్ కూడా చేస్తాడా అనిపించే విధంగా ఉన్నది వీడియో. 

పాత్రను అలా డిజైన్ చేసి, వరుణ్ నుంచి అలాంటి నటన రాబట్టుకున్న హరీష్ శంకర్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి.  ఈ మూడు సినిమాల్లో మొదట సెప్టెంబర్ 13 వ తేదీన వాల్మీకి వస్తున్నది. ఆ తరువాత అక్టోబర్ 2న మెగాస్టార్ సైరా రిలీజ్ అవుతున్నది.  చివరిగా వచ్చే ఏడాది సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో రిలీజ్ అవుతుంది.  ముగ్గురు వచ్చారు.  ఎవరు నిలబడతారో తెలియాలంటే సమయం పడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: