ప్రభాస్ సాహు ప్రమోషన్స్ బిజీలో ఉన్నాడు.  సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  మరో ఐదు రోజుల్లో సినిమా థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కోసం ప్రభాస్ అండ్ కో కాళ్లకు చక్రాలు కట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నారు.  ప్రమోషన్స్ ను వదలకుండా చేస్తున్నారు.  ఈ సినిమా కోసం నెక్స్ట్ సినిమాను పక్కన పెట్టారు. 


రాధాకృష్ణతో చేస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ సినిమాను కొంతకాలం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.  సాహో రిలీజ్ అయ్యి.. సక్సెస్ మీట్ లు పూర్తయ్యే వరకు ప్రభాస్ సాహో తో కలిసి ఉండక తప్పదు.  పైగా ఇది సొంత సినిమా అందుకే అంత బాధ్యత తీసుకొని ప్రమోషన్స్ చేస్తున్నారు.  యాక్షన్ సినిమాలు చేయాలనీ ఉన్నా.. తనకు లవ్, కుటుంబ కథా చిత్రాలంటే ఆసక్తి ఉందని చెప్పిన ప్రభాస్ తన మనసులోని ఓ మాటను కూడా బయటపెట్టాడు.  


ప్రభాస్ కు పౌరాణిక సినిమాలు చేయాలని ఉందని, ఒకవేళ అలాంటి అఫర్ వస్తే.. మహాభారతంలోని కర్ణుడు లేదా అర్జునుడు లాంటి పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.  ఈ మాటల వెనుక చాలా అర్ధం ఉన్నది అని మనం అర్ధం చేసుకోవచ్చు. ఎలాగంటే .. ప్రస్తుతం అల్లు అరవింద్ మరో ఇద్దరు నిర్మాతలు కలిసి రామాయణం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  దాదాపు 1500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కించాలని చూస్తున్నారు.  


పైగా పాన్ ఇండియా మూవీ.  ఇందులో ఇప్పటికే రాముడిగా హృతిక్ రోషన్ ను అనుకుంటున్నారు.  రామాయణంలో కర్ణుడు, అర్జునుడు ఉండరు కాబట్టి, రాముడి తరువాత అంతటి మంచి పేరును తీసుకొచ్చే పాత్ర ఒకటి ఉన్నది అదే లక్ష్మణుడి పాత్ర.  అన్న అడుగుజాడల్లో నడిచే వ్యక్తిగా లక్ష్మణుడికి పేరు ఉన్నది.  సో, రామాయణంలో ప్రభాస్ ను ఆ పాత్రకు ఒప్పిస్తే.. సినిమాను నిండుదనం వస్తుంది.  పైగా హృతిక్ రోషన్ అన్నా, ప్రభాస్ తమ్ముడు అంటే అదరహో అనిపిస్తుంది.  


అంతేకాదు, ఎలాగో రావణుడిగా ఎన్టీఆర్ తప్పిస్తే మరొకరిని ఊహించుకోలేరు కాబట్టి ఆ పాత్రకు ఎన్టీఆర్ ను తీసుకుంటే.. తీయబోయే సినిమాకు మంచి  మార్కెట్ ఉంటుంది.  అల్లు అరవింద్ అనుకున్నట్టుగా సినిమాకు అంతర్జాతీయంగా పేరు వస్తుంది.  ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అరవింద్ రావడం వెనుక ఉద్దేశ్యం కూడా ఇదే అనుకోవచ్చు.  ప్రభాస్ ను రామాయణం సినిమాకోసం ఇప్పటికే సంప్రదించి ఉంటారు.  అందుకే ఆయనకోసం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి ఉంటారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: