స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్  విక్రమ్ కుమార్  దర్శకత్వంలో  నేచురల్ స్టార్  నాని కథానాయకుడిగా  తెరకెక్కిన సినిమా 'గ్యాంగ్ లీడర్'. కాగా సరికొత్త కంటెంట్ తో రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ రోజు విడుదలైన ఈ  చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో  బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ చిత్రంగా నిలిచింది.  కాగా అప్పుడే ఈ సినిమా ప్రీమియర్ షోల కలెక్షన్స్ వచ్చేశాయి. యూఎస్ లో  మొత్తం 177 లొకేషన్స్  లోని  ప్రీమియర్ షోల నుండి $182,679 డాలర్స్ సాధించింది. పర్ఫెక్ట్ హిట్ కోసం నాని ఎంచుకున్న ఈ  'గ్యాంగ్ లీడర్' రివేంజ్ కామెడీ డ్రామాగా సాగుతూ మొత్తానికి ఆకట్టుకున్నాడు.  ముఖ్యంగా  సినిమాలో  లక్ష్మీ, శరణ్య, ప్రియాంక తదితరులతో కూడిన గ్యాంగ్‌ తో నాని చేసిన సీన్స్‌  చాలా ఎంటర్‌టైనింగ్‌ గా సాగుతాయి. అలాగే క్లైమాక్స్ లో నాని, కార్తికేయతో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా  ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఇక మ్యూజిక్ సంచలనం  అనిరుధ్ ఈ సినిమాకి  అందించిన సంగీతం మరియు  హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ అలాగే  ఓపెనింగ్ యాక్షన్ సన్నివేశం బాగా ఆకట్టుకున్నాయి.  సంగీత దర్శకుడు అనిరుద్  అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా  లవ్ సీన్స్ లో  ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. పెన్సల్ పార్ధ సారథి అనే పాత్రలో నాని  తన పాత్రకు తగ్గట్లు... తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ  సినిమాకే  హైలెట్ గా నిలిచాడు. 


ఏమైనా  ఎంటర్టైన్మెంట్ జానర్ నానికి బాగా  కలిసొచ్చే అంశం అని మరో సారి ప్రూవ్ అయింది.  ఎందుకంటే నాని కెరీర్లో భారీ హిట్స్ గా  నిలిచిన సినిమాలు 'భలే భలే మగాడివోయ్, నేను లోకల్, అష్టా చమ్మా, పిల్ల జమీందార్, క్రిష్ణగాడి వీరప్రేమగాధ' లాంటి చిత్రాలన్నీ కామెడీ జానర్ చిత్రాలే. ఈ రోజు వచ్చిన  'గ్యాంగ్ లీడర్'తో సహా. ఇక  ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన  చెన్నై బ్యూటీ  ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ హిట్ తో టాలీవుడ్ లో ఎంతవరకూ నెట్టుకొస్తోందో చూడలి.  అలాగే ఇటీవలే గుణ అంటూ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న  'ఆర్ఎక్స్ 100' హీరో  కార్తికేయ నెగిటివ్ రోల్ లో హిట్ అందుకున్నాడు.  అలాగే ఇతర కీలక పాత్రల్లో  వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య  చాల బాగా నటించారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ మ్యూజిక్ అందించారు.        


మరింత సమాచారం తెలుసుకోండి: