‘సైరా’ ట్రైలర్ విడుదలై కొన్ని గంటలు కాకుండానే ఆ ట్రైలర్ సృష్టిస్తున్న విద్వంసం ఈ మూవీ బయ్యర్లకు మాత్రమే కాకుండా మెగా అభిమానులకు విపరీతమైన జోష్ ను కలిగిస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది గంటలలోనే నిన్న గూగుల్ లో ట్రేండింగ్ గా మారింది. 

నిన్న అర్దరాత్రి సమయం దాటేసరికి ఈ ట్రైలర్ ఇండియాలో రెండవ స్థానంలో నిలవడమే కాకుండా ప్రతి నిముషానికి వేల సంఖ్యలో హిట్స్ పడుతూ ఉండటం ఈ ట్రైలర్ ను ప్రశంసిస్తూ ట్విట్స్ వర్షం కురుస్తూ ఉండటం ఈ ట్రైలర్ ను ట్రెండింగ్ గా మార్చింది.  కేవలం రెండు గంటలలో ఈ ట్రైలర్ కు 20 లక్షల వ్యూస్ రావడంతో పాటు అర్దరాత్రి సమయానికి ఈ ట్రైలర్ కు 40 లక్షల వ్యూస్ దాటిపోవడంతో ఒకరోజు పూర్తి కాకుండానే ఈ ట్రైలర్ కు కోటి వ్యూస్ వస్తాయని అంచనా వేస్తున్నారు. 

ముఖ్యంగా చిరంజీవి ఈ మూవీ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్స్ ట్రెండింగ్ గా మారడంతో ఈ మూవీ పై అత్యంత భారీ అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ లో చిరంజీవి నోటివెంట వచ్చిన ‘గెట‌వుట్ ఫ్రమ్ మదర్ ల్యాండ్’ అంటూ చిరంజీవి రౌద్ర రూపంతో చెప్పిన డైలాగ్ ను బట్టి ఈమూవీకి ఎవరూ ఊహించని స్థాయిలో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అని అంటున్నారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ తో చరణ్ ఈ మూవీ పై పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇక రాబోతున్న ఆదివారంనాడు జరగబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ‘సైరా’ మ్యానియా ఏ స్థాయికి చేరుకుంటుందో అంచనాలకు కూడ అందడం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: