చక్రవకం, మొగలి రేకులు సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ఉరఫ్ సాగర్ సిద్ధార్థ్ అనే సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడింది. ఆ తరవాత సాగర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాకు ఆయనకు నిరాశనే మిగిల్చింది. కాగా ఈసారి షాది ముబారక్ అనే సినిమాతో వచ్చాడు సాగర్. శుక్రవారం విడుదల
లైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ కథనం :
కథలోకి వెళితే మాధవ్ సున్నిపెంట (సాగర్) జాతకంలో అతడికంటే పెద్ద వయసు కలిగిన అమ్మాయితో వివాహం జరుగుతుందని జాతకంలో ఉంటుంది. దాంతో టెన్షన్ పడిన మాధవ్ తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేసేందుకు ఓ మ్యాట్రిమోని ని సంప్రదిస్తారు. ఆ మ్యారేజ్ బ్యూరో యజమాని (రాజశ్రీ నాయర్) ఆవిడే సినిమా హీరోయిన్ సత్యభామ తుపాకుల (దృశ్య రఘునాథ్). మాధవ్ కు ఒకే రోజు మ్యారేజ్ బ్యూరో యజమాని మూడు పెళ్లి చూపులను అరేంజ్ చేస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల సత్యభామ కూడా మాధవ్ తో కలిసి పెళ్లి చూపులకు వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం..అంతలోనే మనస్పర్థలు రావడం జరుగుతుంది. చివరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా అనేదే సినిమా కథ. ఇక సినిమా విషయానికొస్తే సాగర్ ఇదివరకు నటించిన రోటీన్ కథల జోలికి వెళ్లకుండా...కూల్  బ్రీజ్ లవ్ స్టోరీని ఎన్నుకున్నారు. నిజానికి కథలో చెప్పుకోదగ్గ విషయాలేమి లేకపోయినా ఆధ్యంతం వినోద భరితంగా సినిమా సాగుతుంది.  ఫస్ట్ హాఫ్ అంతా పెళ్లి చూపులు చుట్టూ తిరిగితే..సెకండ్ హాఫ్ లో అపార్ధం చేసుకున్నవారికి వివరణ ఇవ్వడంతో సినిమా వేగం తగ్గుతుంది. ఇక ఈ సినిమాలో కొన్ని పాత్రలకు దర్శకుడు సరైన వివరణ ఇవ్వలేదని అనిపిస్తుంది. కానీ సినిమా మొత్తంగా చూసుకున్నప్పుడు చాలా కాలం తరువాత.. ముఖ్యంగా కరోనా తరవాత ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

నటీనటుల పర్ఫామెన్స్ :
సినిమాలో నటీనటుల విషయానికొస్తే అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సిరియల్స్ లో ఎమోషన్ లను పండించిన సాగర్ ఏ సినిమాలో కొత్తగా కనిపించాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మలయాళీ భామ దృశ్య రగునాథ్ కూడా తన నటన తో ఆకట్టుకుంది. సత్య భామ అనే పాత్రకు న్యాయం చేసింది. మిర్చి హేమంత్ ఫారెన్ పెళ్లి కొడుకుగా కామెడీని భాగా పండించారు. రాహుల్ రామకృష్ణ, భద్ర కూడా కామెడీ కూడా సూపర్ అని చెప్పొచ్చు.

సాంకేతిక విభాగం :
సినిమాలో సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే...ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ స్వరాలు సమకూర్చారు. అయితే చిత్రంలో పాటలు భాగా లేకపోయినప్పటికీ నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. దర్శకుడు రోటీన్ ప్రేమ కథ అయినప్పటికీ సినిమాను స్క్రీన్ ప్లే తో నడిపించాడు. ఎక్కడా అనవసర యాక్షన్ సన్నివేశాలు యాడ్ చేయకుండా సాఫీగా సినిమాను   నడిపించాడు. మొదట ఈ సినిమాను సాగర్ తన స్నేహితులతో కలిసి మొదలు పెట్టగా...దిల్ రాజు శిరీష్ లు కథ నచ్చడంతో బాధ్యతగా తీసుకుని సినిమాను టేకోవర్ చేశారు. కాబట్టి వారిని అపిషేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మొత్తానికి షాది ముబారక్ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయగలిగే సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: