
వైసీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. బడా నాయకులు, పేరున్న, నోరున్న లీడర్లు కండువాలు మార్చుకుంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే తెలంగాణా అసెంబ్లీ రద్దు అయింది కానీ ఏపీలో మాత్రం హీట్ బాగా రాజుకుంటోంది. పోయిన వారం నెల్లూరు పెద్దాయాన ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరితే ఇపుడు నేదురుమల్లి తనయుడు చేరిపోయారు.
పవర్ ఫుల్ ఫ్యామిలీ
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రాంకుమార్‌రెడ్డి ఈ రోజు విశాఖపట్నంలో జగన్ ని కలసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాంకుమార్‌రెడ్డి ముఖ్య అనుచరులతో సహా చేరిపోయారు. రాంకుమార్‌రెడ్డికి జగన్.పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 1990, డిసెంబర్ 17 నుంచి 1992, అక్టోబర్ 9 వరకు ఏపీ సీఎంగా సేవలందించారు. 1998-99 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. ఇదిలా ఉండగా రనున్న రోజులలో మరిన్ని చేరికలు పార్టీలో ఉంటాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి.