ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్ క్రైస్తవుడు.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. ఆయన కుటుంబం కొన్ని తరాల నుంచి క్రైస్తవాన్ని అనుసరిస్తోంది. ఆయన చెల్లెలి భర్త స్వయంగా మతప్రబోధకుడు కూడా. తల్లి విజయమ్మ నిత్యం బైబిల్‌ చేతిలో ఉంచుకుంటారు. గతంలో వైఎస్  రాజశేఖర్‌ రెడ్డి పై కూడా క్రిస్టియన్ అన్న ముద్ర ఉండేది. 


అయితే.. ఇటీవలి కాలంలో వైఎస్ జగన్ ఎక్కువగా స్వామీజీలను నమ్ముతున్నారు. ఎన్నికల్లో టికెట్ల ప్రకటన, నామినేషన్ల ముహూర్తం.. మేనిఫెస్టో ప్రకటన.. ఇలా అన్ని సందర్భాల్లోనూ స్వామీజీలు చెప్పిన ముహూర్తాల ప్రకారమే నడుస్తున్నాడు. హిందూసంప్రదాయాలను ఆకళింపు చేసుకుంటున్నాడు. 

ఆ మధ్య కాలంలో జగన్ తిరుపతి వెంకటేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నాడు. అంతే కాదు.. జగన్ ఇటీవల ఓ రెండు నెలల పాటు మహాభారతంపై ఓ ప్రవచనకర్తతో ఉపన్యాసాలు కూడా విన్నాడని తెలిసింది. అందుకే ఇటీవల ఆయన ఉపన్యాసాల్లో భారతం కథలు వినిపిస్తున్నాయి. 

ఇవన్నీ జగన్ పై ఉన్న క్రిస్టియన్ ముద్రను చెరిపేసే అవకాశం ఉంది. అంతేకాదు.. తనకు పరమత సహనం చాలా ఎక్కువ అన్న సంగతిని ప్రజలకు గుర్తు చేస్తాయి. మహాభారతం వంటి గ్రంధాలు ఆధ్యాత్మిక విజ్ఞానాన్నే కాదు వ్యక్తిత్వ వికాసాన్ని అందజేస్తాయి. ఇవి కచ్చితంగా జగన్‌ను మంచి మార్గం వైపు నడిపిస్తాయనడంలో సందేహం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: