
ఇంకొన్ని గంటలు మాత్రమే ఈ ఆఫర్? ఒక్కరోజే ఈ అవకాశం అంటూ కొనుగోలుదారులను ఆకట్టుకునే ఆఫర్లను ఎంతవరకు నమ్మొచ్చు. అమెజాన్ యాజమాన్యం తెలుపుతున్న ప్రకారం ఎప్పుడూ లేనివిధంగా ఇప్పుడు సేల్స్ పెరిగాయంట. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ తెలిపిన సమాచారం ప్రకారం ఈ దసరా సందర్భంగా 6 రోజులలో జరిగే సేల్స్ కేవలం రెండు రోజుల్లోనే పూర్తయ్యాయని సంతోషాన్ని వ్యక్తం చేసారు. దసరాతో మొదలయ్యే ఈ ఆఫర్లు దీపావళి వరకు కొనసాగుతుంటాయి. నెల రోజులపాటు కొనసాగే ఈ పండగ సీజన్‌లోనే చాలా కంపెనీలు 40 శాతం వరకు ఆదాయాన్ని అర్జిస్తాయి. ఇదే విషయాన్ని సామ్‌సంగ్, సోని, షియోమీ లాంటి సంస్థలు ఇప్పటికే ధ్రువీకరించాయి.
మాములుగా ఈ కంపెనీలు ఇస్తున్న 20 నుంచి 90 శాతం వరకు డిస్కౌంటుల ప్రకటనలు నమ్మొచ్చా? నిజంగానే ఇంత డిస్కౌంట్లు ఇస్తారా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? ''డిస్కౌంట్లు ఇచ్చే మాట వాస్తవమే. అయితే, ఇందులో చాలా మతలబులు ఉంటాయి. ముందుగా ప్రోడక్ట్స్ ధరను పెంచుతారు. ఆతర్వాత డిస్కౌంట్ల రూపంలో కోత విధిస్తారు''అని సిమాంటిక్స్3లో డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్న అభిషేక్ భట్ వ్యాఖ్యానించారు. 2019 పండుగ సీజన్‌లో ఆఫర్ల డేటాను సిమాంటిక్స్3 విశ్లేషించింది. ఆఫర్ ప్రైజ్, లిస్ట్ ప్రైజ్, డిస్కౌంట్ల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించేందుకు సంస్థ ఓ ప్రత్యేక టూల్‌ను కూడా అభివృద్ధి చేసింది. లిస్ట్ ప్రైజ్‌నే స్టిక్కర్ ప్రైజ్ అని కూడా అంటారు. ఇది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దీనిని బట్టి మనము ఆఫర్ ప్రకారం కొంటున్న వస్తువు అసలు ధరలో భాగమే అని మరిచిపోతున్నాము ఇకనైనా మేలుకోండి.