ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చాలా చోట్ల వైసీపీ ఆధిప‌త్యం చాటుతున్నా ఓ ప్రాంతంలో మాత్రం వైసీపీ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ ప్రాంతం ఏదో కాదు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతం. గుంటూరు జిల్లాలో మంగ‌ళ‌గిరి, తాడికొండ‌, పెద‌కూర‌పాడు, పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌రావ‌తి ప్రాంతం విస్త‌రించి ఉన్న ప‌ల్లెల్లో అధికార వైఎస్సార్ సీపీ వాళ్ల‌కు పెద్ద షాకే ఎదురు కానుంది. ఈ ఎన్నిక‌లు పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా జ‌రుగుతున్న‌ప్ప‌ట‌కీ గెలిచిన అనంత‌రం ఫ‌లితాల‌ను మాత్రం త‌మ పార్టీ ఖాతాలోనే వేసుకునేందుకు ప్ర‌ధాన పార్టీలు పోటీ  ప‌డుతున్నాయి.

ఇక అమ‌రావ‌తి ప్రాంతంలో వారంతా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓట్లేసి గెలిపించారు. అమ‌రావ‌తి చుట్టు ప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ జెండాయే ఎగిరింది. అయితే రాజ‌ధాని మార్పుతో ఈ ప్రాంతంలో ప్ర‌జ‌ల ప‌రిస్థితి త‌ల్ల‌కిందులు అయ్యింది. వీరి వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయి. రియ‌ల్ భూం డాం అంది. దీంతో చాలా మంది ప్ర‌త్య‌క్షంగానే కాకుండా.. ప‌రోక్షంగా కూడా ఉపాధి కోల్పోయారు. మ‌రి కొంద‌రు కోట్లాది రూపాయ‌లు పోగొట్టుకుని వ్యాపారాల్లో దెబ్బ‌తిన్నారు. ఇక ఇప్పుడు కులాల గోల ఎక్కువైంది. వీరంతా వైసీపీకి వ్య‌తిరేకంగా ఓటు వేయ‌నున్నారు.

దీంతో ఈ స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అమ‌రావ‌తి వైసీపీ స్థానిక నేత‌ల‌తో పాటు ఎమ్మెల్యేలు సైతం భ‌య‌ప‌డుతోన్న ప‌రిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఎన్నిక‌లు ఎందుకు వ‌చ్చాయిరా ?  బాబు అని రాజ‌ధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. జిల్లాకే చెందిన ఓ వైసీపీ నేత అయితే నియోజకవర్గంలో వైసీపీ గెలవడం కష్టమేనని ముందుగానే ఒప్పేసుకున్నారట‌. దీనిని బ‌ట్టే ఇక్క‌డ వైసీపీ ప‌రిస్థితి ఎలా ?  ఉందో తెలిసిపోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: