
బీజేపీ.. ప్రజలకు కోతలు వాతలు తప్ప ఎం చేయలేదు అని, 43వార్డు లకు 43గెలిచి చరిత్ర తిరగరాయాలి అని కోరారు. అవార్డ్ ల ఖిల్లా గా సిద్దిపేటకు పేరు వచ్చింది అని, మున్సిపల్ ఎన్నికలలో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి అని ఆయన వెల్లడించారు. ఉత్సాహ వంతులైన యువకులు రాజకీయాల్లోకి రావాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. లక్ష ఓట్లతో గెలిపించిన ప్రజలకు ఎంత చేసిన తక్కువే అని అన్నారు. ఏ పదవిలో ఉన్న సిద్దిపేట కోసం ఆలోచిస్తా అని హరీష్ రావు స్పష్టం చేసారు. పార్టీ మారే వారికోసం ఆలోచించ వద్దు, పార్టీ లైన్ లో మనం నడవాలి అని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ కన్నతల్లి లాంటింది, 43వార్డ్ లు గెలిచి చరిత్ర తిరగ రాయాలి అని విజ్ఞప్తి చేసారు. సిద్దిపేట నెక్లెస్ రోడ్ రాష్ట్రానికి ఆదర్శం అని అన్నారు. 15కోట్లతో సింథటిక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం అని, ఆరోగ్యం కాపాడడం కోసం సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసామని చెప్పారు. రెండున్నర కోట్లతో త్వరలోనే పుట్ బాల్ కోర్ట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సిద్దిపేటలో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ సిద్దిపేట అని హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట కు ఇప్పటికే 10జాతీయ అవార్డ్ లు వచ్చాయి అని చెప్పుకొచ్చారు. ఏడాది లోగా 25కోట్లతో పూర్తి స్థాయి నెక్లెస్ రోడ్ అందుబాటులోకి తెస్తాము అని హామీ ఇచ్చారు. త్వరలోనే ఇక్కడ సీసీ కెమెరాలు, మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేసామని అన్నారు. ఈ నెల 10 నా తొలిసారి గా సిద్దిపేటలో గ్లో గార్డెన్ ప్రారంభిస్తాం అని, ఉగాది కానుకగా మ్యూజికల్ పౌంటెన్ ఏర్పాటు చేస్తామని హరీష్ పేర్కొన్నారు.