వినాయక చవితి వచ్చింది అంటే చాలు సందడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా పెద్దా అందరూ కలిసి ఒకచోట చేరి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ఇక తొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా పూజలు చేస్తూ ఉంటారు. అంతే కాదు ఎంతో నిష్ఠగా గణేషుడిని పూజిస్తూ కోరిన కోరికలు నెరవేర్చాలని మొక్కుకుంటూ ఉంటారు. దీంతో ఇక వినాయక చవితి వచ్చిందంటే వాడ వాడ మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది. తొమ్మిదిరోజులపాటు ఎక్కడ చూసినా కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.



 ఇక చిన్న పెద్ద అందరూ కూడా గణేష్ మండపాలకు చేరుకుని సందడి చేస్తూ ఉంటారు. అంతే కాదు తొమ్మిది రోజుల పాటు ఎన్నో విధాలుగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక ఇటీవల కాలంలో వినాయకుడిని ప్రతిష్టించడంలో కూడా కాస్త వినూత్నంగా ఆలోచిస్తున్నారు చాలామంది. ఇక అందరూ పెట్టినట్లుగా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేసి వినాయకుడిని పెడితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది విభిన్న రీతిలో ఉండే వినాయక ప్రతిమలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అందరికంటే భిన్నంగా మట్టి వినాయకులను పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని భావిస్తూ ఉంటారు.



 ఇక ఇలా ఎంతో వినూత్నమైన వినాయక ప్రతిమలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉంటాయ్. ఇక ఇలాంటి ఒక వినాయక ప్రతిమ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. అంతే కాదు అందరికీ నోరూరెలా చేస్తోంది. ఇప్పటికే డాక్టర్, రైతు, జవాన్ పోలీస్ ఇలా పలు రూపాల్లో గణేషున్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఇటీవలే పంజాబ్లోని లూసియానాకు చెందిన కొంత మంది భక్తులు డార్క్ చాక్లెట్తో గణేష్ విగ్రహాన్ని రూపొందించారు. ఏకంగా 200 కిలోల చాక్లెట్ ఉపయోగించి గణనాధుని ప్రతిమను తయారు చేశారు. ఇక ఈ గణేష్ ని చూస్తుంటే ఓ వైపు భక్తితో పాటు మరోవైపు చాక్లెట్ చూసి నోరూరిపోతుంది ప్రతి ఒక భక్తుడికి.

మరింత సమాచారం తెలుసుకోండి: