దేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో సమర్ధత అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పరిస్థితి కనపడటం లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు నిర్వహించాలి అని భావించడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉత్సాహాన్ని నింపుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ పాదయాత్ర చేసే అవకాశం కనపడుతోంది.

అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా పాదయాత్ర చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని అంటున్నారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి అక్కడ ముందుకు వెళ్ళినా సరే సొంతంగా పార్టీని బలోపేతం చేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటిని మరింతగా బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా హర్యానాలో పంజాబ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అని భావిస్తున్న కెప్టెన్ మహేందర్ సింగ్ పంజాబ్ లో పాదయాత్ర చేయడానికి సిద్దంగా ఉన్నారని సమాచారం.

సీఎంగా పాదయాత్ర నిర్వహిస్తే మాత్రం అది సంచలనం అవుతుంది.సీఎం పాదయాత్ర ఇప్పటి వరకు ఎక్కడా కూడా చేయలేదు. సీఎం కావడానికి పాదయాత్ర చేయడమే కాని సీఎం పదవిలో ఉండి ఇలా ప్రజల్లోకి వెళ్లడానికి పాదయాత్రను ఎంచుకోవడం అదే తొలిసారి అవుతుంది. అయితే ఆయన ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుంది ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా పంజాబ్ లో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంది. వయసు కూడా ఎక్కువగా ఉండటంతో సీఎం ఎంత వరకు ముందుకు అడుగులు వేస్తారు ఏంటి అనేది చూడాలి. ఆయనతో పాటుగా కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చు అనే కామెంట్స్ కూడా ఎక్కువగానే వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: