వైద్య విద్యను అభ్యసించాలి అనేది ఎందరో విద్యార్ధుల కోరిక. డాక్టర్ కావాలనే తపనతో చాలా మంది వివిధ రకాల ప్రవేశ పరీక్షలు రాస్తూ ఉంటారు. అందులో నీట్ ప్రవేశ పరీక్ష ఒకటి ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షను నిర్వహించవద్దు అని విపక్షాలు డిమాండ్ చేసినా సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసినా సరే పరిక్ష మాత్రం ఆగలేదు. పరీక్ష విషయంలో చాలా వరకు సందేహాలు ఉన్నా సరే కేంద్రం వాటికి సమాధానాలు ఇస్తూ నిర్వహించింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న తప్పులు మినహాయితే పరీక్ష సజావుగా నిర్వహించారు.

ఇప్పుడు తమిళనాడులో ఒక ఘటన చోటు చేసుకుంది. నీట్ పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. అదే రోజున తమిళనాడు శాసన సభలో వైద్య కోర్సుల కోసం నీట్ ను రద్దు చేయడానికి ఒక బిల్లును ఆమోదించింది. . కనిమొళి అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కనిమొళి ఆదివారం నీట్ పరీక్ష రాసారు. ఆ పరీక్షలో ఆమె అనుకున్న విధంగా స్కోర్ చేసే అవకాశం లేదని భావించి ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కనిమొళి ఇంటర్ లో మంచి స్కోర్ సాధించింది.

అయినా సరే తాను డాక్టర్ అవ్వలేననే భయంతో నిరుత్సాహానికి గురైనట్లు ఆమె బంధువులు తెలిపారు. కనిమొళి తన గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. కేసు నమోదు చేసిన విక్రమంగల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ బిడ్డ మంచి స్టూడెంట్ అని కాని నీట్ పరీక్ష విషయంలో ఆత్మహత్య చేసుకోవడం తమను కలవరపెడుతుంది అని తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. తమిళనాడు లో ఈ పరీక్షను రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షం అన్నాడిఎంకె మరియు దాని మిత్రపక్షం పిఎంకెతో సహా అన్ని పార్టీలు, కాంగ్రెస్ వంటి ఇతర పార్టీలు మద్దతు ఇచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: