మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి... మీడియాతో మాట్లాడుతూ... కీలక వ్యాఖ్యలు చేసారు. మహబూబ్ నగర్ లో జంగ్ సైరన్ పై టీఆరెఎస్ నేతలు విరుచుకు పడ్తున్నారు అని కేసీఆర్ భరతం పట్టేందుకు రేవంత్ పీసీసీ అయ్యాడు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి పై అనవసర విమర్శలు మానుకోండి అని హితవు పలికారు. ఆయనపై ఉన్న కేసులతో జైల్లో పెడతామని చెబుతున్నారు అని అన్నారు. రేవంత్ పై ఉన్న కేసుతో ఆయన్ను జైల్లో పెట్టడం మీ వల్ల జరిగే పని కాదని అన్నారు. రేవంత్ పై ఉన్న కేసు ఎన్నికల సంఘం పరిధిలోనిది అని ఆయన తెలిపారు.

కేసీఆర్ తిరుపతిలో రాయలసీమను రతనాల సీమగా చేస్తనన్నారు అని గుర్తు చేస్తూ అప్పుడు ఏమైంది పాలమూరు జిల్లా టీఆరెఎస్ నేతల నోళ్ళు ఎందుకు ముగబోయినవి అని నిలదీశారు. ప్రగతి భవన్ లో సంగమేశ్వర ప్రాజెక్టు రూపకల్పన జరిగింది అని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసలు టీఆరెఎస్ ఎమ్మెల్యే లకు, మంత్రులకు తెలుసా అని ప్రశ్నించారు. ఎల్లురు నుండి సింగొరం వద్ద ప్రాజెక్టు పూర్తి కాలేదా అని నిలదీశారు. మంత్రి నిరంజన్ రెడ్డి నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన తెచ్చుకో అని హితవు పలికారు.

కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ హయంలోనే పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలయ్యాయి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయంలోనే పెట్టిన మోటర్లను.. కేసీఆర్ సర్కార్.. కిందికి దింపి నాలుగు బోల్టులు బిగించి కొబ్బరికాయలు కొడ్తున్నరు అని అన్నారు. కల్వకుర్తి, నెట్టం పాడు, బీమా, కొహిల్ సాగర్ అంత.. కాంగ్రెస్ హయంలోనే చేశాం అని గుర్తు చేసారు. వాటికి లిఫ్ట్ లు, ప్రధాన కాల్వలు అప్పుడే జరిగాయి అని పేర్కొన్నారు. ఎస్ ఎల్ బీసీ  పూర్తి చేస్తే..నల్గొండ జిల్లా లోని చాలా ప్రాంతాలకు నీళ్ళు వచ్చేవి అని అన్నారు. కుర్చీ వేసుకొని పూర్తి చేస్తా అన్న కేసీఆర్.. ఎక్కడున్నావ్ అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts