టీడీపీ-జనసేనల పొత్తు గురించి పలు రకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే జగన్‌ని ఎదురుకోగలుగుతారని, లేదంటే ఇబ్బందులు తప్పవని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఇదే క్రమంలో రెండు పార్టీల శ్రేణులు సైతం పొత్తు విషయంలో క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పనిసరిగా పొత్తు ఉంటుందని అందుకు తగ్గట్టుగానే రెడీగా ఉండాలని అనే విధంగా ఉన్నారు. ఇటు నాయకులు సైతం పొత్తు విషయంలో రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీ నేతలే కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పొత్తు ఉంటే...జనసేనకు కొన్ని సీట్లు కేటాయించాలి.

175 స్థానాల్లో టీడీపీకి నాయకులు ఉన్నారు...అలాంటప్పుడు కొన్ని సీట్లని జనసేన కోసం టీడీపీ నేతలు త్యాగం చేయాలి. అయితే ఈ విషయంలో జనసేనకు పెద్దగా ఇబ్బంది లేదనే చెప్పాలి. ఏదో 10-15 నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ బలంగా ఉంది తప్ప..మిగిలిన స్థానాల్లో పెద్దగా పట్టు లేదని గత ఎన్నికల్లోనే రుజువైంది. కాబట్టి ఆ పార్టీ పెద్దగా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అందుకే టీడీపీ నేతలే సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది.

ఇదే క్రమంలో జనసేనతో గానీ పొత్తు ఉంటే...ఆ పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలనే దానిపై కూడా కొన్ని చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించాలసిన అవసరం ఉంటుంది. దీని బట్టి చూస్తే గుంటూరులో జనసేన ఏ సీట్లు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే గత ఎన్నికల ఫలితాలని బట్టి చూస్తే గుంటూరులో ఏ నియోజకవర్గంలోనూ జనసేన ప్రభావం చూపలేకపోయింది. కాకపోతే గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, తెనాలి నియోజకవర్గాల్లో కాస్త డిపాజిట్లు తెచ్చుకుంది. అంటే ఈ సీట్లలోనే జనసేనకు కాస్త పట్టు ఉందనే చెప్పాలి. అంటే వీటిల్లోనే జనసేనకు కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: