ముందుగా ఊహించినట్టే ప్రపంచం అంతటా ఒమిక్రాన్ కమ్ముకుంటోంది. ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. క్రమంగా ప్రంపంచం అంతటా ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 7 రెట్లు ఎక్కువగా వ్యాపించే లక్షణం ఉన్న విషయం తెలిసిందే. అదే ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి కారణం అవుతోంది. ఇప్పుడు ఒమిక్రాన్.. అటు అమెరికా, ఇటు ఆస్ట్రేలియా.. మధ్యలో ఐరోపా దేశాలు.. ఇలా అన్ని దేశాల్లోనూ తన ప్రతాపం చూపుతోంది. కొన్ని దేశాల్లో అయితే రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.


ఇలా కరోనా విజృంభించేందుకు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కారణమని భావిస్తున్నారు. అంతే కాదు.. ముందు ముందు రాబోయే రోజుల్లో ఈ ఒమిక్రాన్ వ్యాప్తి  తీవ్రంగా విజృంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే.. యూరప్‌లో ఒమిక్రాన్ పీక్‌ రేంజ్‌లో వ్యాపిస్తోంది. అంతే కాదు.. రానున్న నెలల్లో ఒమిక్రాన్ ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ వంటి దేశాలు యూకే నుంచి వస్తోన్న ప్రయాణికులపై ఆంక్షలు  కూడా విధిస్తున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.


ఒమిక్రాన్ విజృంభణ ఎలా ఉందంటే.. ఫ్రాన్స్‌లో కొత్తగ 60 ఏల మందికి కొత్త వైరస్ సోకింది. అందుకే ఫ్రాన్స్‌ తో పాటు జర్మనీ, రిపబ్లిక్‌ ఆఫ్ ఐర్లాండ్, నెదర్లాండ్స్‌ కూడా కొత్తగా తమ పౌరులపై ఆంక్షలు పెడుతున్నాయి. ఇక జర్మనీ విషయానికి వస్తే.. అక్కడ ఒక్కరోజులోనే 50వేలు కొత్త కేసులు వచ్చాయట. ఇప్పటికే ఫ్రాన్స్‌, నార్వే, డెన్మార్క్‌ వంటి దేశాలను రిస్క్‌ దేశాలుగా గుర్తిస్తున్నారు. ఇక బ్రిటన్ విషయం మరీ దారుణంగా ఉంది. బ్రిటన్‌లో వరుసగా మూడో రోజు కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు వచ్చాయట.


బ్రిటన్‌లో మళ్లీ కరోనా విజృంభించడానికి ఒమిక్రానే కారణమని అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో తాను ముందుగానే అప్రమత్తం చేశానని స్కాట్‌లాండ్ ఫస్ట్ మినిస్టర్ చెబుతున్నారు. 7 రోజుల క్రితం తాను హెచ్చరించిన సునామీ ఇప్పుడు తాకుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తున్నా.. దాని కారణంగా ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు చాలా తక్కువకావడం ఒక్కటే ఊరటగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: