ఎక్స్ ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ .. ఈ ప‌దం విని ఎవ్వ‌రూ న‌వ్వుకోవ‌ద్దు. ఎందుకంటే మ‌న  రాష్ట్రంలో ఈ ప‌దం వింటే బూతులు మాత్ర‌మే గుర్తుకువ‌స్తాయి. ఆరోజు మ‌మ్మ‌ల్ని తిట్టారు ఇప్పుడు మేం అంత‌కుమించి దిగ‌జారి నోట్లో గుట్కా పాన్ మాసాలాలు ఉంచి మ‌రీ మా మాట‌ల‌కు మ‌సాలా ద‌ట్టించి మరీ తిడ‌తాం అని అంటారు కొడాలి నాని అనే ఓ బూతుల మంత్రి. ఇది క‌దా ఎక్స్ ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే! స్పీక‌ర్ సీతారాం కానీ లేదా ఆ స్థాయి వ్యక్తులు కానీ జ‌గ‌న్ అభిమతం మేర‌కు శాస‌న‌స‌భ‌లో తిట్ల పురాణం వింటూ క‌నీసం స‌భ్యుల‌ను కంట్రోల్ చేయ‌నైనా చేయ‌రు ఇది క‌దా ఎక్స్ ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే.. ఏమంటే ఆ రోజు కోడెల‌ను గుర్తుకు తెస్తారు.. పోనీలేండి ఇప్పుడేం అయింది ఇప్పుడు కూడా కోడెల లాంటి స్పీక‌ర్ ఒక‌రు మాకు దొరికారు అని త‌ప్ప‌క సంతోషించి దిష్టి తీస్తాం మా సీతారాం స‌ర్ కు....! సెష‌న్ బిహేవియ‌ర్ ఇవాళ్టికీ ఆ పార్టీ పెద్ద‌ల‌కూ పెద్ద పెద్ద నాయ‌కుల‌కూ తెలియ‌వా? ఏం లేదు ఎంత తిడితే అంత మైలేజీ ఇదే క‌దా ఆస‌క్తి / ఇదే కదా అనుర‌క్తి / ఇదే క‌దా స్వామి భ‌క్తి / ఇది క‌దా మాకొక రొచ్చు మ‌రియు రోత కూడా!  


రాజ‌కీయంలో ఎన్నో ఒడిదొడుకులు చూసిన జ‌గ‌న్ రేప‌టి వేళ బ‌ర్త్ డే బోయ్. వైఎస్సార్ భ‌క్తుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించిన నేత‌గా జ‌గ‌న్ కు పేరుంది. ఆ మాట‌కు వ‌స్తే చాలా మంది వైఎస్ భ‌క్తులు కాంగ్రెస్ లో ఇవాళ్టికీ ఉన్నారు. ర‌ఘువీరా లాంటి వైఎస్ భ‌క్తులు ఇటు ర‌మ్మ‌న్నా రారు. వారికి చేత‌గాదు. అదేవిధంగా ఉండ‌వ‌ల్లి అరుణ్, కేవీపీ లాంటి దిగ్గజ నేత‌లు వైఎస్ భ‌క్తులు కానీ జ‌గ‌న్ వెంట రారు. రాలేరు. ఎందుకంటే వాళ్లంతా జ‌గ‌న్ చెప్పిన విధంగా ఇత‌ర పార్టీ  నేత‌ల‌ను తిట్ట‌రు.

వావీ వ‌ర‌స‌లు మ‌రిచి త‌న సొంత పార్టీ నాయ‌కులు ఇత‌ర పార్టీల నేత‌ల‌ను తిడుతుంటే అసెంబ్లీలోనే న‌వ్వులు చిందిస్తూ వీడియోల‌కు చిక్క‌రు. క‌నీసం నియంత్రించ‌క‌పోగా ఒక మ‌గువ‌ను ఉద్దేశించి చెప్పే మాటలు లేదా చేసే వ్యాఖ్య‌లు (అవి ఎంతటి స్థాయిలో ఉన్నాయ‌న్న‌ది అసెంబ్లీ నాలుగు గోడ‌ల‌కే ఎరుక‌) విని న‌వ్వి ఎవ్వ‌రూ ఊరుకోరు.

కానీ జ‌గ‌న్ కు పాల‌న క‌న్నా వైఎస్ భ‌క్తులను ఇటుగా ర‌ప్పించి పార్టీని బ‌లోపేతం చేయ‌డం క‌న్నా చంద్ర‌బాబును తిట్ట‌డంలోనో, తిట్టించ‌డంలోనో  ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ ను ప్రేమిస్తారు. ప్రేమించ‌డం ఎలానో కూడా నేర్పిస్తారు. అదే ఆయ‌న ఎక్స్ ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్...దీనినే ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ అని తెలుగులో రాయాలి అని చ‌దివేను. ఇది మిన‌హాయించి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, నిరుద్యోగ స‌మ‌స్య నివార‌ణ కోసం ఆయ‌న చేసిందేం లేదు. చేయ‌లేరు కూడా!

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp