
అయితే ఇందులో భాగంగా కొందరు మహిళా నేతలకు కూడా సీట్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్నవారే నెక్స్ట్ ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. మొదట శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో గుండా లక్ష్మీ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. పలాస సీటు గౌతు శిరీషకు ఫిక్స్. ఇక రాజాంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తనయురాలు గ్రీష్మ పోటీ చేస్తారని ప్రచారం ఉంది. కానీ ఇక్కడ మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఉన్నారు. మరి ఈ సీటు ఎవరికి ఇస్తారో చూడాలి.
సాలూరులో గుమ్మడి సంధ్యారాణి, విజయనగరంతో అతిథి గజపతిరాజు, శృంగవరపుకోటలో కోళ్ళ లలితకుమారిలు ఫిక్స్. అలాగే పాయకరావుపేటలో వంగలపూడి అనిత, పాడేరులో గిడ్డి ఈశ్వరి, రంపచోడవరంలో వంతల రాజేశ్వరిలు పోటీ చేయడం ఖాయమే. కాకినాడలో పిల్లి అనంత లక్ష్మీ, చింతలపూడిలో పీతల సుజాతలకు సీట్లు ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.
అలాగే నందిగామలో తంగిరాల సౌమ్యకు ఫిక్స్. చిత్తూరు, పూతలపట్టు సీట్లు మహిళలకు కేటాయిస్తారా లేదా? చూడాలి. తిరుపతిలో సుగుణమ్మ, రాప్తాడులో సునీతమ్మ, ఆలూరులో సుజాతమ్మ, ఆళ్లగడ్డలో అఖిలప్రియలు బరిలో దిగడం ఖాయమే. ఇక రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవాని ప్లేస్‌లో ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే ఈ మహిళా నేతలకు దాదాపు సీట్లు ఫిక్స్ అని చెప్పొచ్చు.