ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలి...ఇదే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ టార్గెట్. 2014లో తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారు. 2018లో విపక్షాలు అన్నీ కలిసి కేసీఆర్‌పై దండయాత్ర చేస్తున్నాయని, అలాగే చంద్రబాబు కూడా ఎంటర్ అవ్వడంతో మరొకసారి తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్ అధికారంలోకి వచ్చేశారు. సరే ఎలాగోలా రెండుసార్లు సెంటిమెంట్‌తోనే అధికారంలోకి వచ్చారు. మరి మూడోసారి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అంటే తెలంగాణ ప్రజలు ప్రతిదీ గుడ్డి నమ్మేవాళ్లు కాదు.

అందుకే కేసీఆర్‌ని నమ్మడం తగ్గించారు...అలాగే ఆటోమేటిక్‌గా టీఆర్ఎస్ బలం తగ్గుతూ వస్తుంది. ఆ విషయం స్పష్టంగా కనబడుతోంది. అదే సమయంలో బీజేపీ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. అటు కాంగ్రెస్ కూడా లైన్‌లోకి వచ్చింది. దీంతో తనకు కష్టాలు తప్పవని కేసీఆర్‌కు అర్ధమైంది. అందుకే ప్లాన్ మార్చేశారు...ఈ సారి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదని అర్ధం చేసుకుని ఓట్లని చీల్చే ప్రక్రియ మొదలుపెట్టారు. ఎంత కాదు అనుకున్న తెలంగాణలో బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది..క్షేత్ర స్థాయిలో బలం ఉంది.


అలాంటప్పుడు కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తే జనం ఆ పార్టీ వైపు చూస్తారు..అందుకే ఆ పార్టీని ప్రత్యర్ధిగా చూడటం మానేశారు. బలంగా లేని బీజేపీని టార్గెట్ చేశారు. దీంతో జనం బీజేపీ వైపు చూడటం మొదలుపెట్టారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న వారు...బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెటారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్‌తో పోటీకి వచ్చింది. అలా అని ఆ పార్టీని డామినేట్ చేసే స్థాయి బీజేపీకి రాలేదు.

ఇదే కేసీఆర్‌కు కావాల్సింది..అటు కాంగ్రెస్‌కు కొంత బలం ఉంది...ఇటు బీజేపీకి కొంత బలం పెరిగింది. ఇక ఈ రెండు పార్టీల మధ్య తమ వ్యతిరేక ఓట్లు చీలిపోతే...ఆటోమేటిక్‌గా కేసీఆర్‌కే లాభం. ఇప్పుడు అదే జరుగుతుంది. తాజాగా వచ్చిన ఓ నేషనల్ సర్వేలో సైతం 17 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ 8, ఎం‌ఐ‌ఎం 1, బీజేపీ 6, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. అంటే ఇక్కడ ఎం‌ఐ‌ఎంతో కలిసి టీఆర్ఎస్ సేఫ్ అవుతుంది. బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని అర్ధమైంది. ఇక ఇదే మళ్ళీ టీఆర్ఎస్‌ని అధికారంలోకి తీసుకొస్తుందని కేసీఆర్ నమ్ముతున్నారు. మొత్తానికి చూసుకుంటే కేసీఆర్ ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: