
నగరి రాజకీయాల్లో రోజాకు ఒకప్పుడు తిరుగులేదు. ఆ రోజు అసెంబ్లీలో పార్టీ ఏం చెబితే అది చేశారు. టీడీపీతో కయ్యం పెట్టుకుని సస్పెండ్ అయ్యారు. ఆ తరువాత కూడాఅదే పంథాలో అప్పటి స్పీకర్ కోడెలను, అప్పటి సీఎం చంద్రబాబును,ఇతర మంత్రులను ఢీ కొన్నారు.కానీ ఇప్పుడు అనూహ్య రీతిలో పెద్దిరెడ్డి రాజకీయంలో ఓడిపోతున్నారు. ఒంటరి అయిపోతున్నారు. పెద్దిరెడ్డి ని ఢీ కొనలేక, తనకున్న శక్తి చాలక,అధిష్టానం మద్దతు కూడా లేక రోజా విలవిలలాడిపోతున్నారు.ఈ దశలోనే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు.
ఇక డిప్యూటీ సీఎం కూడా అంతే! పార్టీ అధికారంలోకి రాకమునుపు కురుపాంలో ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. విపక్షంలో ఉంటూనే ఆ రోజు ఎమ్మెల్యే హోదాలో ఇంటింటికీ తిరిగి పార్టీ భావజాలాన్ని విస్తృత రీతిలో ప్రచారం చేశారు.దీంతో జగన్ ఆమెకు
సముచిత స్థానమే ఇచ్చారు.గిరిజన సంక్షేమ శాఖను కేటాయిస్తూనే, డిప్యూటీ సీఎంను చేశారు. పదవి అందుకున్నాక ఎవ్వరూ
ఊహించని రీతిలో సైలెంట్ అయిపోయారు.ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారు.
ఇక పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి కూడా ఇదే కోవకు చెందుతారు. వరుసగా ఆమె రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీ విధేయురాలిగా పేరున్నప్పటికీ తనదైన ముద్రను పాలనలో వేయలేకపోతున్నారన్నవిమర్శ కూడా ఉంది.దీంతో ఏజెన్సీ ఏరియాల్లో వైసీపీకి ఈ సారి ఘన విజయం దక్కడం అన్నది మాత్రం అనుమానమే!