
మరి అలాంటి పరిస్థితుల్లో నియోజక వర్గానికి కేవలం 100 మందికే ఎలా ఇస్తారన్నది ఇంకా అంతుబట్టని ప్రశ్న.. ఈ పథకానికి లబ్దిదారుల ఎంపికకు ఎలాంటి ప్రాతిపదిక ఉంటుందన్నది ఇంకా నిర్ణయించలేదు. అయితే.. ఈ పథకం ఇచ్చేది మా కార్యకర్తలకే అంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు.
ఆ విషయాన్ని బహిరంగంగా కూడా చెబుతున్నారు. దళిత బంధులో టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందని.. ఆ తర్వాతే మిగతావారికి ఇస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కామెంట్ చేయడం వివాదానికి దారి తీస్తోంది.
దళితబంధు ముందు టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తామని.. ఆ తర్వాతే మిగతా వారికి ఇస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఓపెన్ గానే చెబుతున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురంలో పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. అంతే కాదు... ఈ దళితబంధు ఎంపికలపై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోబోమన్నారు. ముందు అర్హులైన టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తామన్నారు.
అంతే కాదు.. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అధికారంలో ఉండాలన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందుకోసం పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు మొదట అందేలా చూస్తామని తేల్చి చెప్పారు. రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులను మాత్రం అధికారులు ఎంపిక చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. దళితబంధు ఎంపికలను మాత్రం నేరుగా సీఎం కేసీఆర్ చేస్తున్నారని.. అవి మనోళ్లకే వస్తాయని ఎమ్మెల్యే చెబుతున్నారు.