ఐదు రాష్ట్రాల ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లో చివరి విడత ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. యూపీలో ఈ ఆఖరు విడతలో 9 జిల్లాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఈ విడతలో 54 శాసన సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలోని మొత్తం 54 శాసనసభ స్థానాలకు 613 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

 
యూపీలో ఈ తుది విడతలో 2.6కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. ఈ తుది విడతలోని ముఖ్యాంశాలు ఏంటంటే.. ఈ విడతలోనే వారణాసి పార్లమెంట్‌ స్థానంలో పది నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ పోలింగ్ జరుగుతున్న 54 అసెంబ్లీ స్థానాల్లో 2017 ఎన్నికల్లో 36 స్థానాల్లో గెలిచిన బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలిచాయి. ఎస్పీ 11 స్థానాలు గెలుచుకుంది. బీఎస్పీ 6 స్థానాలు గెలుచుకుంది. ఇవాళ్టి పోలింగ్‌తో మొత్తం యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తి అవుతాయి.


యూపీలో ఇవాళ జరుగుతున్న పోలింగ్‌తో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇవాళ ఏవైనా చెదురుమదురు సంఘటనలు జరిగితే.. రీపోలింగ్‌ రేపు, ఎల్లుండిలో జరుపుతారు. ఏదేమైనా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 10 జరుగుతుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం.. పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు వెల్లడించ కూడదు. ఈ మేరకు ఈ సారి ఈసీ నిబంధనలు కఠిన తరం చేసింది. ఇప్పటికే ఈ విడతలో ఎన్నికలు పూర్తయిన మిగిలిన 4 రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు కూడా వెల్లడించకూడదని ఈసీ ముందే హెచ్చరించింది.


అందుకే.. ఇప్పటి వరకూ ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు వెల్లడి కాలేదు. ఇక ఈ సాయంత్రం 6 గంటలతో ఎన్నికల పోలింగ్ సమయం పూర్తవుతుంది కాబట్టి.. ఈ సాయంత్రం 6 గంటల తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలను మీడియా సంస్థలు, ఇతర సంస్థలు ప్రకటించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: