మరో నేత ఇపుడు కాంగ్రెస్ గూటికి చేరుకుంది. అప్పట్లో బీజీపీ పార్టీలో వున్న ఈ నాయకురాలు ఇపుడు కాంగ్రెస్ పార్టీ పంచన చేరడంతో అంతా షాక్ అవుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఒకరి తరువాత మరొకరు కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ వైపు మరలిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. ఇందుకు సంబంధించి పలు వార్తలు సంచలనంగా మారాయి. కాగా ఇపుడు సీన్ రివర్స్ అయ్యింది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలం పుంజుకుంటున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు అధికార పార్టీ నుంచి రివర్స్ లో కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగు బాట కనిపిస్తోంది.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో టీఆర్ఎస్ ఇప్పటికే ఫుల్ అయిపోగా, అధికార పార్టీలో నేతల మద్య చిర్రు బుర్రులు ఎక్కువై కాంగ్రెస్ పార్టీలోకి వలసలు రోజు రోజుకీ ఎక్కువ అవుతాయి. ఇతర పార్టీ నేతలే కాక స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెలుతుండటం. మొన్నటికి మొన్న పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి స్వస్తి పలికి కాంగ్రెస్ పార్టీ లోకి అడుగుపెట్టగా ఇపుడు కత్తి కార్తీక గౌడ్ గాంధీభవన్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దం అయ్యారు. కత్తి కార్తీక రేపు 11:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ నేతగా హస్తం జండా పట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్కల సమక్షంలో గాంధీ భావం లో కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా అసలు ఇంతకీ కత్తి కార్తీక బిజెపి ని వీడి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళుతున్నారు అసలు విషయం ఏంటి అన్న సందేహాలు మాత్రం వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈమె ఇంతకు ముందు తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: