ప్రతిపక్షం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలే టీడీపీకన్నా నయమనిపించారు. వరదబాధితులను ఆదుకునేందుకు తమవంతు సాయంగా కోనసీమ జిల్లాలోని లంకగ్రామాల్లో సహాయచర్యలు చేశారు. భారీవర్షాలు, వరద కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల్లో కనీసం కొందరికైనా జనసేన నేతలు భోజనాలు, కొంతవరకు వస్తుసామగ్రి అందించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేస్తామని చెప్పుకుంటున్న జనసేన నేతలు అందుకు నాందిగా ఎంతోకొంత సాయం చేస్తున్నారు.





అమలాపురం నియోజకవర్గంలో మారుమూల గ్రామాలతో పాటు లంక గ్రామాలకు కూడా జనసేన నేతలు వెళ్ళి తమకు ఉన్నంతలో  సాయమందించారు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాగూ సహాయ కార్యక్రమాలు అందిస్తునే ఉంది. వరదముంపులో ఇరుక్కున్న జనాలను, గొడ్డు, గోదాను కూడా పడవల్లో ఎక్కించి సహాయక శిబిరాలకు ప్రభుత్వ యంత్రాంగం తరలించింది. నూరుశాతం సహాయసహకారాలు అందించిందని చెప్పలేంకానీ వీలున్నంతలో చాలామందికే సాయం అందించింది.





ఇదే సమయంలో జనసేన నేతలు కూడా తమవంతుగా సహాయ కార్యక్రమాలకు దిగారు. మంచిదే ఆపదలో ఉన్నవారికి ఎంతమంది సాయంచేస్తే అంతమంచింది. మరిదే సమయంలో టీడీపీ ఏమిచేసింది. నిర్మాణాత్మకమైన సాయం అందించాల్సిందిపోయి చంద్రబాబునాయుడు అండ్ కో నానా గోల చేస్తున్నారు. వరదసాయం అందించిన గ్రామాలకు వెళ్ళి మరీ తమకు ప్రభుత్వంనుండి ఎలాంటి సాయం అందలేదని బాధితులతో మీడియా ముందు టీడీపీ నేతలు చెప్పిస్తున్నారు. చంద్రబాబు అండ్ కో వెళ్ళిపోగానే ప్రభుత్వం నుండి తమకు సాయం అందిందని, ఇంకా అందుతోందని బాధితులే చెబుతున్నారు.





నిజానికి వరదల సమయంలో బురద రాజకీయం చేయాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు. కానీ సాయంచేయటంకన్నా రాజకీయం చేయటంపైనే ఎక్కువ దృష్టిపెట్టిన చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదచల్లేస్తున్నారు. సాయం అందని జనాల దగ్గరకు వెళ్ళి తమకు ప్రభుత్వంనుండి ఎలాంటి సాయం అందలేదని చెప్పించినా అర్ధముంది. అంతేకానీ సాయం అందిన జనాలతో కూడా తమకు ఎలాంటి సాయం అందలేదని చెప్పించటం చవకబారు రాజకీయంకాక మరేమవుతుంది ? ఇక్కడే జనసేనకు టీడీపీకి తేడా కనబడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: