రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ దెబ్బకు ఉక్రెయిన్ జనాలే కాదు ఇపుడు సొంతదేశంలోని జనాలు కూడా బెదిరిపోతున్నారు. పుతిన్ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో తెలీక ముందుజాగ్రత్తగా దేశంవదిలి పారిపోతున్నారు. గడచిన వారంరోజుల్లో వేలాదిమంది రష్యా నుండి పారిపోయారని సమాచారం. దేశం వదిలి పారిపోతున్నవారంతా అర్మేనియా, రుమేనియా, స్లొవేకియా, టుర్కియే, అజర్ బైజాన్ లాంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు.


ఇంతకీ దేశంలో జనాలు రష్యాను వదిలి పారిపోయేంతగా పుతిన్ ఏమి చేశారు ? ఏమిచేశారంటే ఉక్రెయిన్ తో యుద్ధం గడచిన ఎనిమిదిమాసాలుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే కొన్నివేలమంది సైనికులు చనిపోయారు. అంటే ఉక్రెయిన్లో  యుద్ధం చేయటానికి రష్యాకు సైనికుల కొరత మొదలైంది. దాంతో కొత్త సైనికులను రిక్రూట్ చేసుకోవటం అత్యంతవసరం.

ఇప్పటికిప్పుడు సైన్యం రిక్రూట్ చేయటం, వాళ్ళకి శిక్షణ ఇవ్వటం జరిగేపనికాదు. అందుకనే మాజీ సైనికులందరినీ యుద్ధరంగంలోకి దిగటానికి సిద్ధంగా ఉండమని సైన్యాధికారుల నుండి ఆదేశాలు అందాయి. సైన్యంలో రిటైర్ అయిన వారందరు వెంటనే అవసరమైన మెడికల్ టెస్టులన్నీ చేయించుకుని రెడీగా ఉండాలని ఆదేశాలు వచ్చాయి. దాంతో మాజీ సైనికులందరికీ ఏమి చేయాలో అర్ధంకావటంలేదు. ఇపుడు మాజీ సైనికులనే చెప్పినా ముందు ముందు మామూలు జనాలను కూడా యుద్ధానికి రెడీగా ఉండమని ఆదేశాలు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదనే ఆందోళన యూత్ లో పెరిగిపోతోంది.


యుద్ధం చేయటం ఇష్టంలేక అలాగని ఆదేశాలను ధిక్కరించలేక ఏకంగా రష్యాను వదిలి పారిపోతున్నారట చాలామంది. పుతిన్ నుండి ఆదేశాలు వచ్చిన దగ్గర నుండి సుమారు 2.6 లక్షల మంది దేశం వదిలేసి పారిపోయారని లోకల్ మీడియా చెబుతోంది. దేశంనుండి బయటపడాలనే ఆతృత జనాల్లో పెరిగిపోతున్న కారణంగా విమానసంస్థలు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి. టికెట్ ధరలను వేలాది రూపాయలు పెంచేసినా జనాలు లెక్కచేయకుండా కొనేస్తున్నారు. దాంతో టికెట్ల ధరలను తమిష్టం వచ్చినట్లు పెంచేసి విమానసంస్ధలు బ్రహ్మాండమైన బిజినెస్ చేసుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: