రాజు మనవాడైతే రాచరికానికి కొదువుండదు అన్నారు పెద్దలు.. ఇది అక్షరాల నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే, వారి తాలూకూ బంధులకు గానీ, మిత్రులకు గానీ, అత్యంత సన్నిహితులకు గాని ఏ విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. ఉదాహరణకు సినిమా ధియోటర్ యజమాని మనవాడైతే రోజు వీలైనన్ని సినిమాలు ఉచితంగా చూడవచ్చూ.. ఇలా చెప్పుకుంటు వెళ్లితే ఎన్నో ఉన్నాయి.. ఇకపోతే తెలంగాణాలో తాజాగా సమాచార హక్కు చట్టం కోసం కొత్త  కమిషనర్లను నియమిస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో నియమితులు అవుతున్న వారి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే..

 

 

ఒక రకంగా ఈ కమిషనర్లుగా నియమించ బడుతున్న వారు అధికారపక్షం వారికి అత్యంత సన్నిహితులట.. అందుకే సమాచార హక్కు చట్టం అని దీనికి వీరిని కమిషనర్లుగా నియమిస్తున్నారట.. దీని పుణ్యమా అని ఈ పదవులు వారిని సంతోష పెట్టటానికి ఒక అవకాశం అని అనుకుంటున్నారట.. ఇకపోతే మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఆర్టీఐ కమిషనర్లను ఏర్పాటు చేయనున్న నేపధ్యంలో, ఎవరిని నియమించాలన్న దానికి సంబంధించి ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో మజ్లిస్ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. సీఎస్ సోమేష్ కుమార్ ఉండగా, వీరు తమకొచ్చిన దరఖాస్తుల్నిపరిశీలించి ఐదుగురు పేర్లను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.

 

 

ఈ ఐదుగురి పేర్లలో కట్టా శేఖర్ రెడ్డి.. నారాయణ రెడ్డి.. సయ్యద్ ఖలీలుల్లా.. అమీర్.. గుగులోత్ శంకర్ నాయక్ లు ఉన్నారు. దాదాపుగా వీరి పేర్లే ఫైనల్ అవుతాయని చెప్పక తప్పదు. ఎందుకంటే.. కమిటీ సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ ఓకే చేయటానికే అవకాశం ఎక్కువని చెప్పాలి. ఇకపోతే ఈ ముగ్గురిలో ఇద్దరు కేసీఆర్ సొంత మీడియాకు చెందిన వారు కావటం విశేషం. ఇక కట్టా శేఖర్ రెడ్డి ఎవరో కాదు.. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

 

 

నారాయణరెడ్డి కూడా కేసీఆర్ కుటుంబానికి చెందిన టీ న్యూస్ చానల్ కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు కాగా మిగిలిన ముగ్గురికి సంబంధించిన ఎంపిక కూడా ప్రత్యేకంగా జరిగిందేమీ లేదన్న వాదన వినిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా తమ వారికే పదవులు కట్తబెడుతున్నారన్న మాట అని కొందరు తెరవెనక మాట్లాడుకుంటున్నారట..

 

మరింత సమాచారం తెలుసుకోండి: