ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం పర్యటించాలని నిర్ణయం తీసుకుని పర్యటన మొదలుపెట్టారు ఆయన. ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి ఈ పర్యటన మొదలయింది. ఈ పర్యటనకు జనం నుంచి బాగానే మద్దతు వచ్చింది. ఊహించని విధంగా యువతతో పాటుగా స్థానిక ప్రజలు కూడా హాజరై చంద్రబాబుకి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటనలు చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి సిద్దమయ్యారు. 

 

అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఈ పర్యటనకు ముందు చంద్రబాబు ఒక సర్వే చేసారట. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ సర్వే చేసారట చంద్రబాబు. దీనిలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది తారా స్థాయిలో ఉన్నట్టు చంద్రబాబు గుర్తించారు. జగన్ ప్రభుత్వ విధానాలపై ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నారని చంద్రబాబు కి తన సర్వే నివేదికలో తెలిసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి షాక్ తప్పదు అని కూడా చంద్రబాబు కి పక్కా సమాచారం అందినట్టు సమాచారం. 

 

దీనితో ఇప్పుడు చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రను మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి సిద్దమయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్దం చెయ్యాలని చంద్రబాబు నేతలకు కూడా సూచించారు. దీనితో ఇప్పుడు కేడర్ ఫుల్ జోష్ లో ఉందని అంటున్నారు. ఇక ఈ పర్యటనకు ముందు రోజే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన నేపధ్యంలో చంద్రబాబు ఇంకా దూకుడు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ముందు పర్యటించే యోచనలో ఉన్నారట ఆయన. ఏది ఎలా ఉన్నా జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తనకు బలాన్ని ఇవ్వడంతో బాబు ఇప్పుడు ఫుల్ హ్యాపీ గా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: