ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల ఫీవర్, అగ్ని పర్వతంలో లావాలా రోజు రాజుకి రాజుకుంటోంది. ఈసారి అన్నిరకాల ప్రధాన పార్టీలు కూడా వీటిని అత్యంత కీలకంగా భావించి, పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగుతున్నాయి. ఇక టీడీపీ, వైసీపీ గురించి అయితే ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నువ్వా - నేనా అనే రకంగా యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్.. అటు తెలంగాణలోనూ ఈ ఎన్నికలపైన తీవ్రమైన ఉత్కంఠత నెలకొని ఉంది.

 

ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై జగన్ ఓ అద్భుతమైన కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తాజా సమాచారం. అది ఏమంటే... వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, తమ సొంత నియోజకవర్గ బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీ లో నిలపవద్దని, జగన్ సదరు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. ఒకేవేళ ఎవరైనా తన ఆదేశాల్ని పక్కన పెట్టి, బంధువులని బరిలోకి దించితే వారికి బీఫామ్లు ఇవ్వకూడదని రీజినల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసిందట.

 

ఇక తాజా సమాచారం ప్రకారం... కాసేపటి క్రితమే ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ కి నామినేషన్స్ దాఖలు చేయడానికి సమయం ముగిసిందన్నట్లుగా సమాచారం. ఇకపోతే రాష్ట్రం అంతటా.. 660 జడ్పీటీసీ, మరియు  9984 ఎంపీటీసీ స్థానాలకు 21న ఎన్నికలు నిర్వహించనున్నారనే సంగతి విదితమే. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లని రేపు అనగా గురువారం నాడు పరిశీలించనున్నారు. ఆ తరువాత ఈనెల 14న ఫైనల్ లిస్టును ప్రకటించి, 21 న ఎన్నికలు నిర్వహించనున్నారు. 

 

ఇక మొదటి నుండి అనుకున్నట్లు గానే... మార్చి 24న ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక ఎంపీటీసీ జడ్పీటీసీ కి నామినేషన్స్ దాఖలు చేయడానికి సమయం బుధవారం సాయంత్రం 5 గంటలకి ముగియగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటినుంచి మొదలైందనే సంగతి అందరికి తెలిసినదే. ఇక జగన్ ఆలోచనతో చంద్రబాబు మరోసారి కూలబడటం ఖాయమని అప్పుడే వై.సి.పి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: