క‌రోనా విష‌యంలో మ‌రో కొత్త విష‌యం తెలుస్తోంది. ఇన్నాళ్లు వైద్య నిపుణులు చెప్పిన ప్ర‌కారం.. కోవిడ్‌-19 వైర‌స్ ఒక మీట‌ర్ క‌న్నా త‌క్కువ దూరం ప్ర‌యాణం చేస్తుంది. అయితే తాజా అధ్య‌య‌నాల్లో మాత్ర 13 అడుగుల వ‌ర‌కు కూడా వైర‌స్ ప్ర‌యాణం చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోందంట‌. కరోనా బారినపడ్డ వ్యక్తులు తమ్మినా, దగ్గినా వారి నుంచి వైరస్‌ 13 అడుగుల వరకు కూడా ప్రయాణించగలదని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. చైనా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల ఫ‌లితాల‌పై  అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్ డిసీజ్‌ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) జర్నల్‌లో క‌థ‌నాలు ప్ర‌చురితం కావ‌డం గ‌మ‌నార్హం. 

 

ఇదిలా ఉండ‌గా  దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం  స్పష్టం చేసింది. క‌రోనా వైర‌స్ భార‌త్‌లో ఇంకా అదుపు చేయ‌గ‌ల స్థితిలోనే ఉంద‌ని వైద్య‌వ‌ర్గాలు చెబుతున్న విష‌యాన్ని గుర్తు చేసింది. మ‌ర్క‌జ్ మూల‌ల‌తోనే కొన్ని లోక‌ల్ కాంటాక్టులు పెరుగుతున్న మాటైతే వాస్త‌వ‌మేన‌ని, అయితే లాక్‌డౌన్ అమ‌లుతో సామూహిక ద‌శ‌కు చేరుకోకుండా నివారించ‌గ‌లిగిమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. కరోనావైరస్ వ్యాప్తి మూడో దశకు చేరుకుంటే ప్రజలకు తెలియజేస్తామని మరోసారి హామీ ఇచ్చింది. అయితే క‌రోనా వ్యాప్తి, మ‌ర‌ణాల రేటు విష‌యంలో రాష్ట్రాల మ‌ధ్య భారీ వ్య‌త్యాసం క‌న‌బడుతోంది.

 

 ఇదిలా ఉండ‌గా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. దేశంలోని వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.  ఏపీలో కరోనా కేసుల సంఖ్య 386కు చేరుకుంది. కొత్త కేసులు కర్నూలులోనే నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో మొత్తం కేసులు 82కు చేరాయి.ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విష‌యం తెలిసిందే. మెజార్టీ సీఎంలు లాక్‌డౌన్ పొడిగించాలని ప్రధానిని కోరారు. కేజ్రీవాల్, అమరీందర్ సింగ్, నవీన్ పట్నాయక్, యడుయూరప్ప, కేసీఆర్ తదితరులు పొడిగించాలని కోరినట్టు తెలుస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: