చంద్రబాబులో చాణక్యుడు ఉన్నాడు. మంత్రాలకు  చింతకాయలు రాల్చే మాంత్రికుడు ఉన్నాడు. అపర మేధావి ఉన్నాడు. ఇక సవాళ్ళను, సంక్షోభాలను తనకు అనుకూలంగా మార్చుకునే గండరగండ రాజకీయ నేత ఉన్నాడు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని చంద్రబాబు గట్టిగా నమ్ముతారు. 

 

అందుకే ఆయన తిట్టిన నోటితోనే మోడీని పొగుడుతున్నారు. సరే మోడీ ఒకసారి చంద్రబాబుకు ఫోన్ చేశారు. దాంతో బీజేపీలో ఇక తెలుగుదేశం పార్టీ చేయికలిపినట్లేనని తమ్ముళ్ళు అంతా భావించారు. అదే సమయంలో మోడీ భేష్ అంటూ బాబు కీర్తించడం మొదలుపెట్టారు. లాక్ డౌన్ని విధించి కరోనాను కంట్రోల్ చేశారంటూ తెలుగుదేశం అధినేత ఏకంగా మోడీ సార్ గ్రేట్ అనేశారు.

 

దీంతో అందరికీ కొన్ని డౌట్లు వచ్చాయి. మోడీ మళ్ళీ బాబుని చేరదీస్తున్నారా అన్న ఆలోచనలు కూడా కలిగాయి. చంద్రబాబు ఏదైనా సాధించే ఘనాపాటి అని పచ్చ శిబిరం కూడా సంబరాలు చేసుకుంది. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తే బీజేపీతో టీడీపీ బంధాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని అంటున్నారు.

 

చంద్రబాబు తాను విశాఖ టూర్ కి వెళ్తానని కేంద్రానికి లేఖ రాశారు. ప్రత్యేక విమానాన్ని విశాఖ టూర్ కి అనుమతించాలని ఆయన కోరారు. అయితే దాని మీద కేంద్రం నుంచి ఇప్పటిదాకా స్పందన రాలేదు. అంటే బాబు కోరినట్లుగా ప్రత్యేక విమానంలో విశాఖ టూర్ కి కేంద్రం నో చెప్పిందని అనుకోవాలి.

 

ఇలా కేంద్రం ఎందుకు చేసింది అనడానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు అర్జంట్ గా ఇప్పటికిపుడు వెళ్ళి విశాఖలో చేసేది ఏదీ లేదని భావించి అయినా ఉండాలి. ఇక కేంద్రం అనుమతి ఇచ్చినా కూడా రాష్ట్రాలు అంటే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా కూడా పర్మిషన్ ఇవ్వాలి. కేంద్రం ఇవ్వడం వల్ల రాష్ట్రాల్లో వారితో సంబంధాలు ఎలా ఉంటాయోనని, ఎందుకొచ్చిన గొడవ అనుకుని కూడా ఇవ్వకపోయి ఉండొచ్చు.

 

వీటికి మించి బాబుని ఈ సమయంలో ప్రత్యేక విమానంలో అనుమతి ఇచ్చి పంపేంత ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలన్నది కూడా ఉండొచ్చు. అంటే మోడీ సర్కార్ బాబు లేఖను, ఆయన ప్రతిపాదనను పక్కన పెట్టేసిందనే అనుకోవాలి. ఇది ఓ విధంగా బాబుకు దెబ్బేనని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: