వచ్చినా కరోనా వైరస్ కావచ్చు అంతకుముందు జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు కావచ్చు జాతీయ స్థాయిలో ముందు నుంచి పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా గానీ వైయస్ జగన్ ఈ విధంగా ఎలా సంక్షేమ పాలన అందిస్తున్నాడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ వచ్చాక జగన్ తీసుకున్న నిర్ణయాలను చాలా వరకు దేశవ్యాప్తంగా మోడీ అమలు చేయడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురాని రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ ల ప్రక్రియ జగన్ మండలాల వారీగా తీసుకు వస్తే దానిని దేశవ్యాప్తంగా మోడీ జిల్లాల వారీగా అమలు చేయడం జరిగింది.

 

వైరస్ యొక్క తీవ్రతను బట్టి ఆయా జిల్లాలను సదరు జోన్ల గా  గుర్తించడం జరిగింది. ఇటువంటి సమయంలో ఇటీవల మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కంటే జగన్ కి ఎక్కువ అవకాశం లభించింది. వీడియో కాన్ఫరెన్స్ లో ఒకపక్క కరోనా వైరస్ కట్టడి గురించి మాట్లాడుతూనే మరోపక్క ఆర్థికంగా వచ్చే నష్టాలను లాక్ డౌన్ పొడిగిస్తే వచ్చే అవాంతరాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీ కేంద్రం ఇస్తా అన్న దాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. కరోనా ప్యాకేజీ కింద అప్పట్లో కేంద్రం రాష్ట్రాలకు కొంత నగదు ఇస్తామని అప్పట్లో మాట ఇవ్వటం జరిగింది.

 

అయితే ఈ సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆ విషయాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు చేయకపోయినా కానీ జగన్ ధైర్యం చేసి మోడీకి గుర్తు చేశారు. చాలా వరకూ జరిగిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్ కి ఎక్కువ టైం ఇవ్వడంతో ఆయన నిర్ణయాలు కి మోడీ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: