ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ తొలుత చైనాలోనే పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. అయితే మూడు నెలల నర్కయాతన అనుభవించిన దేశంసరిగా ఏప్రిల్ నెల రెండవ వారంలో తమ దేశంలో ఎక్కడా కొత్త కోవిడ్-19 మరణాలు కానీ కేసులు కానీ కొత్తగా నమోదు కాలేదని ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత చైనా ఎంత అనూహ్యంగా కోలుకుందో.. అంతే అనూహ్యంగా మరలా ప్రాణాంతక వైరస్ దెబ్బను చవిచూచింది.

 

ఛైనా లో ఉన్నట్టుండి ఒక్కసారిగా కరోనా రెండవ వేవ్ ఇన్ఫెక్షన్ మొదలైంది. ఇది కరోనా వైరస్ లో రెండవ రకంగా ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ రెండవ సారి వణికిస్తున్న వైరస్ దేశం నుండి మరలా ఇక్కడ ప్రబలిందో వారికి అర్థం కావడం లేదు.

 

ఇదిలా ఉండగా రాజధాని బీజింగ్‌‌లో భారీగా కేసులు నమోదవుతుండటంతో నగరంలోని 90 వేల మంది స్థానికులకు కరోనా నిర్దారణ పరీక్షల చేయాలని భావించి.. సోమవారమే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్థానిక షిన్‌ఫడీ హోల్‌సేల్‌ మటన్ మార్కెట్‌ను సందర్శించినవారిలో పలువురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలుతున్న నేపథ్యంలో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను విధించింది.

 

చైనాలో గత 24 గంటల్లో 49 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో 42 ఒక్క బీజింగ్‌లోనే నిర్ధారణ కావడం గమనార్హం. ఇక పోతే ఏప్రిల్ 7 నాటికి, 81,740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 3,331 మంది చనిపోయారని చైనా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. లెక్కలు కాస్తా ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. దీంతో చైనా వారు ఒక్కసారిగా బీజింగ్ నగరంలోని స్కూళ్ళు అన్నింటినీ మూసివేయడం జరిగింది. ఒకే సారి బీజింగ్ ఎయిర్ పోర్టులో ఉన్న ఫలంగా 1200 విమానాలను రద్దు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: