ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో  ఘర్షణ అంశం రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. అయితే భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు ఈ ఘర్షణలో మరణించిన విషయం తెలిసిందే. అటు చైనాకు చెందిన సైనికులు కూడా కొంత మంది చనిపోయారు. అయితే దీనిపై భారతదేశానికి చెందిన కొన్ని మీడియా సంస్థలు ఏకంగా భారత సైన్యం పైన విమర్శలు గుప్పిస్తున్నాయి. చైనా సైన్యం దాడి చేస్తే పారిపోయి భారత సైన్యం వచ్చింది అని  కొన్ని కథనాలు కూడా ప్రచురిస్తున్నాయి. ఇలా ఏకంగా భారత దేశంలో ఉంటూ భారతదేశంపై వ్యతిరేకంగా వార్తలు రాసే వారు చాలా మంది ఉన్నారు అని చెప్పాలి.

 


 ఇదిలా ఉంటే అటు చైనా కూడా పలు మీడియా సంస్థలు వ్యతిరేకంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడ కూడా చైనాలో జరిగిన వాస్తవాలు లేదా చైనా దాచాలి అనుకుంటున్న నిజాలు  బయటికి చెప్పడానికి ప్రయత్నిస్తుంటాయి చైనాకు వ్యతిరేకంగా ఉన్న ఈ మీడియా సంస్థలు. తాజాగా చైనాకు చెందిన ఒక మీడియా సంస్థ ఒక ఆసక్తికర కథనం ప్రచురించింది. అక్కడ ఇప్పటికే 45 మంది చైనా కు సంబంధించిన సైనికులు  చనిపోగా తాజాగా మరో 16 మంది సైనికులు మరణించారు అంటూ  కథనాలు  ప్రచురితం చేసింది.

 


 అంతే కాకుండా భారత సైనికులు హెచ్చరించిన అప్పుడు గుడారాలను తీసేసిన తర్వాత కొంత దూరంలో  గుడారాలు వేయడంతో భారత సైన్యం వారిని మళ్లీ ఎందుకు వేశారు అని అడగడానికి వెళ్లగా.. ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడికి దిగాయి  చైనా బలగాలు. ఈ సమయంలో అటు భారత సైన్యం ఇటు చైనా సైన్యం కూడా భారీ మొత్తంలో అక్కడ మోహరించింది. అక్కడి నది ప్రాంతం కావడం తక్కువ స్థలం ఉండడం.. చైనా సైనికులు దాడికి భారత సైనికులు చనిపోతున్నారని గ్రహించిన.. భారత యువ సైనికులు ఏకంగా ఇద్దరు చైనా సైనికుల పీకలు పట్టుకుని నదిలో దూకేశారు అన్నటువంటి ఒక కథనాన్ని ప్రచురితం చేసింది అక్కడి మీడియా.

మరింత సమాచారం తెలుసుకోండి: