ప్రస్తుతం కరోనా  వైరస్ సంక్షోభం సమయంలో ఎంతో మంది ఉపాధి కోల్పోయి బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. దొరికిన ఏదో ఒక పని చేసుకుంటూ తీవ్ర ఇబ్బందుల్లోనే  బతుకుబండిని నెట్టుకొస్తున్నారు ఎంతోమంది. ఇలాంటి క్రమంలోనే ఏదో ఒక పని  చేసుకుంటూ కుటుంబ పోషణ చూసుకుంటున్న ఎంతోమందికి యజమానుల నుంచి తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా తన జీతం చెల్లించాలి అని అడిగినందుకు ఏకంగా ఉద్యోగి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఇక్కడ ఒక యజమాని.



 ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది... ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలు తీయడం అంటే సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అసలు మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ఏకంగా ఎంతోమంది ప్రాణాలను గాల్లో కల్పిస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. సాటి మనుషుల విషయంలో దారుణంగా వ్యవహరిస్తూ వెనకా ముందు ఆలోచించకుండా మనుషుల ప్రాణాలను గాల్లో కల్పిస్తున్నారు. ఎక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.



 జీతం అడిగినందుకు ఏకంగా ఉద్యోగిపై యజమాని పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది నగరంలోని ఖైర్ తాల్  ప్రాంతంలో ఉన్న.. మద్యం దుకాణం లో కమలేష్ అనే వ్యక్తి సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. ఇప్పటికే కరోనా  వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కమలేష్ అయినప్పటికీ ఉద్యోగం చేస్తూ జీతం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. గత ఐదు నెలల నుంచి యజమాని అతనికి జీతం చెల్లించలేదు. జీతాన్ని అడిగితే ఏదో ఒక కారణం చెప్పి మాట దాటివేస్తున్నాడు. ఈ క్రమంలోనే విసిగిపోయిన కమలేష్ యజమానిని జీతం కోసం నిలదీశాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన యజమాని ఏకంగా కమలేష్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత స్థానికులు గమనించి మంటలు ఆర్పేశారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: