మామూలుగా మందుబాబుల బెడద రోజురోజుకూ ఎక్కువ అవుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. మద్యం షాపు దగ్గర ఫుల్లుగా మద్యం తాగడం ఆ తర్వాత నడిరోడ్డుపైనే అటూ ఇటూ తూలుతూ నడుస్తూ ఉండటం చేస్తూ ఉంటారు. దీంతో  వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  కొన్ని కొన్ని సార్లు ఇలా అటు ఇటు రోడ్లపై తూలుతూ నడుస్తు ఉన్న మందుబాబులు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటే మరికొన్ని సార్లు తూలుతూ నడుస్తున్న మందుబాబులు తప్పించబోయి వాహనదారులు ప్రమాదానికి గురవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే . ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే తెర మీదకు వస్తున్నాయి.



 తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఫుల్లుగా మద్యం తాగి ఓ వ్యక్తి నడిరోడ్డుపై అటూ ఇటూ తూలుతూ నడుస్తున్నాడు. ఈక్రమంలోనే అటువైపుగా ఒక ఆర్టిసి బస్సు వేగంగా వచ్చింది. ఫుల్లుగా తాగి నడుస్తు పడిపోయిన వ్యక్తిని గమనించిన ఆర్టీసీ డ్రైవర్ ఆ వ్యక్తిని తపించ పోయాడు.. అంతలోనే ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా పక్కనే ఉన్న గుంతలోకి 25 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఆర్టిసి బస్సు దూసుకుపోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని తప్పించబోయి ఆర్టీసీ బస్సు గుంతలోకి దూసుకెళ్లింది.


 హైదరాబాద్ నుంచి కొత్తూరు నందిగామ మీదుగా  జాతీయ రహదారి గుండా బస్సు షాద్నగర్ కు  బయలుదేరింది. సుమారుగా బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక నందిగామ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోకి ఆర్టీసీ బస్సు వస్తున్న సమయంలో తాగిన మైకంలో ఓ వ్యక్తి రోడ్డులో అటూ ఇటూ తూలుతూ పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా ఆ వ్యక్తి ని తప్పించాడు. కానీ అంతలోనే బస్సు అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళన లో మునిగిపోయారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక ఈ ఘటనతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్  కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: