ఏపీలో ఇప్పుడు టీడీపీ నేతలు అధికార పార్టీ నేతలను టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ అంశానికి కూడా టీడీపీ నేతలు ఇప్పుడు మంత్రులను అదే విధంగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరో నేత విమర్శలు చేసారు. ఆర్యవైశ్యుల  సమస్యలపై చర్చించేందుకు ఓ హోటల్ లో టీడీపీ ఆర్యవైశ్య సంఘం సమావేశం ఏర్పాటు చేసింది. చివరి నిమిషంలో హోటల్ లో సమావేశానికి అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు... పోలీసులు నిర్వహిస్తే అరెస్ట్ చేస్తామన్నారు. ఆటోనగర్ లోని టీడీపీ కార్యాలయంలో ఆర్యవైశ్య ప్రతినిధులు సమావేశం పెట్టుకున్నారు.

మంత్రి వెల్లంపల్లి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సమావేశానికి అనుమతి రద్దు చేయించారంటూ ఆగ్రహం  వ్యక్తం చేసారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కరోనా కష్టం కాలంలో అనేక మంది ఆర్యవైశ్యులు ప్రాణాలు విడిచారన్నారు. కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరహరిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటువంటి సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే.. అడ్డుకున్నారు అన్నారు. మంత్రి వెల్లంపల్లి అధికార మదంతో వ్యవహరిస్తున్నారు అని వారు మండిపడ్డారు. అదే సామాజికవర్గం వారి సమస్యలను పట్టించుకోకుండా ఆటంకాలు కలిగిస్తావా అని ఆయన విమర్శలు చేసారు.

ఏదో గాలివాటంలో గెలిచి మంత్రి అయినంత మాత్రాన.. ఇష్టానుసారంగా చేయకూడదు అని ఆయన హెచ్చరించారు. నీ నియోజకవర్గంలో సమావేశం పెట్టుకోకూడదా.. నీకు ఎందుకంత భయం అని ఆయన నిలదీశారు. ఆర్యవైశ్యులు సమావేశం పెడితే.. అడ్డుకోవడానికి సిగ్గుండాలి అని మండిపడ్డారు. పదవుల కోసం ఇంత దిగజారి వ్యవహరించకూడదు అని విమర్శించారు. చరిత్రలో ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారనేది గుర్తుంచుకోవాలి అని ఆయన హితవు పలికారు. నీకు దమ్ముంటే.. రాజీనామా చేసి మళ్లీ గెలవాలని వెల్లంపల్లికి సవాల్ చేసారు. లేదా ఇప్పటికైనా తప్పు అయిపోయిందని.. వైశ్య సోదరులకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: