ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు ల్లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రశాంతం గా ఉన్న సరిహద్దులో చైనా విస్తరణ వాదంతో వ్యవహరించి భారత భూ భాగాల ను స్వాధీనం చేసుకుని భారత పై ఆధిపత్యం సాధించాలి అనే ఉద్దేశం తో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించండి. ఊహించని విధంగా భారత్ సమాధానం ఇవ్వడం తో.. చైనా ప్రస్తుతం దిక్కు తోచని స్థితిలో పడి పోయింది అన్న విషయం తెలిసిందే. ఇక భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారిపోతుంది. రోజు రోజుకు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అన్నది కూడా ప్రస్తుతం అర్థం కాని విధంగా ఉంది.



 ఓవైపు ఎముకలు కొరికే చలిలో కూడా అటు ఇరుదేశాల సైనికులు చలిని  తట్టుకుంటూ పహారా కాస్తూనే ఉన్నారు. అయితే భారత్ చైనా సరిహద్దు లో ఇటీవల రష్యా మధ్యవర్తిత్వం వహించడం తో ఒప్పందం కుదిరింది అని గత కొన్ని రోజుల నుంచి భారత్లోని పలు మీడియా సంస్థలు ప్రొజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇరుదేశాలు క్రమక్రమంగా వెనక్కి వెళ్లేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అంటూ ప్రచారం కూడా జోరందుకుంది. కానీ సరిహద్దుల్లో మాత్రం ఎక్కడా ఇరుదేశాల సైన్యాన్ని వెనక్కి వెళ్ళకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.



 కాగా  ప్రస్తుతం సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఇన్ని రోజుల వరకు ఒప్పందం కుదిరింది అని జరిగిన ప్రచారం మొత్తం ఫేక్ అన్నది తేలిందట. ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని.. అంతేకాకుండా రోజురోజుకూ సరిహద్దుల్లో మోహరింపులు  పెరిగిపోతున్నాయి అన్నది అర్ధమవుతుంది. గడ్డకట్టుకుపోయే చలిలో పహారా కాస్తున్న సైనికులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతుండటం చూస్తుంటే  సరిహద్దుల్లో ఇప్పట్లో వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: