గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు కాస్త ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్తుంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత అనేది వస్తుంది. దీని వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్లే లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా బలంగా ఉన్నా సరే ఈ పరిణామాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్న పరిస్థితుల ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే అనేక ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి.

కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేసే విషయంలో దూకుడుగా వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే ప్రచారంలో పాల్గొనడం లేదని సమాచారం ఉందో వాళ్లందరికీ కూడా మంత్రి కేటీఆర్ ఫోన్లు చేస్తున్నారు. దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొనడం లేదని సమాచారం మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేలు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా సమాచారం. త్వరలోనే ఎమ్మెల్యేల ప్రచారం లోకి రావాలని లేకపోతే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీని ముందుకు అడుగులు వేయకపోతే మాత్రం అనేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అని చెప్పారు.

కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఉందని ఆయన ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. ఎవరూ కూడా నిరాశ పడవద్దు అని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత పార్టీలో ప్రభుత్వంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయని కాబట్టి మంత్రి పదవుల విషయంలో ఇతర పదవుల విషయంలో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ హామీ ఇస్తున్నారు. దీనితో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ప్రచారం లోకి రావటానికి కాస్త ఆసక్తి గా ఉన్నారని వార్తలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: