కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొని... ఏకంగా పెద్ద నోట్ల రద్దు చేస్తూ ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత వెయ్యి రూపాయల నోట్ల స్థానంలో 2000 రూపాయల నోటు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2000 రూపాయల నోటు తీసుకు వచ్చిన తర్వాత ఎంతో మందికి చిల్లర కష్టాలు మొదలయ్యాయి అనే విషయం తెలిసిందే. ఎంతోమంది రెండు వేల రూపాయల నోటు తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ తర్వాత అందరూ అలవాటు పడిపోయారు. 2000 రూపాయల నోటు అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్లీ రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది అని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయారు. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారగ దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.



 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోటు పూర్తిగా నిలిపి వేసేందుకు నిర్ణయించుకుంది అనే సారాంశం కలిగిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అందుకే చాలా మటుకు ఏటీఎంలలో కూడా రెండు వేల రూపాయల నోట్లను పెట్టడం లేదు అంటూ ఈ వార్తలో ఉంది. అందుకే కొన్ని బ్యాంకులు కూడా ఇలా రెండు వేల రూపాయల నోట్లు ఏటీఎంలో పెట్టడానికి స్వస్తి పలికాయి అంటూ వార్తలో  పేర్కొని ఉంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నోటు రద్దు చేసేందుకు నిర్ణయించిందని అందరూ సిద్ధం కావాలి అంటూ ఓ వార్త వైరల్ గా మారిపోయింది. ఇటీవలే ఈ వార్త పై కేంద్రం స్పందించింది.




 బ్యాంకులకు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్లు సరఫరాను నిలిపి వేసింది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అంటూ స్పష్టం చేసింది. బ్యాంకులకు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోటు సరఫరా నిలిపి వేయలేదని  కొనసాగుతూనే ఉంది అంటూ తెలిపింది. అయితే గతంలో కూడా ఇలా 2000 రూపాయల నోటు రద్దు చేశారు అని వార్తలు వైరల్ గా మారిన నేపథ్యంలో.. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పందించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకులకు ₹2000 నిలిపివేస్తున్నట్లు ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదు అని ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు అంటూ గతంలో నిర్మల సీతారామన్ క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: