తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్ గా వెళ్ళాలి అని భావిస్తూ తెరాస పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఇప్పుడు ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచారు. టిఆర్ఎస్ వేగంగా పతనం అవుతుంది అని ఆయన అన్నారు. 2018 ఎన్నికలలో బీజేపీకి 105 నియోజక వర్గాలలో కనీసం డిపోసిట్ కూడా రాలేదు అని ఎద్దేవా చేసారు.

బీజేపీ ఒక నీటి బుడగ.. అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ప్రతి గ్రామంలో, ప్రతి మునిసిపాలిటీ లో కార్యకర్తల బలం ఉన్నది  అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు అనుబంధ సంఘాలు ఒక అసెట్ అని ఆయన వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన చెప్పుకొచ్చారు. కొంత మంది స్వార్థపరులు, పార్టీ లో అన్ని అనుభవించి ఇప్పుడు పార్టీ ని తిడ్తున్నారు అని ఆయన ఆరోపించారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్ ను బీజేపీ, టిఆర్ఎస్ లు అమలు చేయలేకపోయాయి అని ఆయన ఆరోపణలు చేసారు.

ఈ దద్దమ్మలు ఐటీఐర్ ఇవ్వకపోవడం వల్ల లక్షల మందికి రావాల్సిన ఉద్యోగాలు పోయాయి అని ఆరోపించారు. అయోధ్య గురించి మాట్లాడే బీజేపీ వాళ్ళు తెలంగాణలోని భద్రాద్రి గురించి ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించడంలో  బీజేపీ ఘోరంగా విఫలం అయ్యింది  అని మండిపడ్డారు. మైనార్టీ ల పట్ల బీజేపీ దారుణంగా వ్యవహరిస్తోంది అని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికె పుట్టినట్టు ఉంది అని మండిపడ్డారు. తెలంగాణ  నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది అని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: